Puri Jagannath: టాలీవుడ్ సీనియర్ దర్శకుడు పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఓ వెలుగు వెలిగినటువంటి ఈయన ఇటీవల కాలంలో అనుకున్న స్థాయిలో ఇండస్ట్రీలో సక్సెస్ అందుకోలేకపోతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా పాన్ ఇండియా స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారందరూ కూడా ఒకప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమాలు చేసి సక్సెస్ అందుకున్న వారని చెప్పాలి.
ఇకపోతే ఈయన చివరిగా డబల్ ఇస్మార్ట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుని ఇక ఈ సినిమా తర్వాత ఈయన ఎలాంటి సినిమాలను ప్రకటించలేదు అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా కనిపించే పూరి జగన్నాథ్ తరచూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా విడాకులు తీసుకుని విడిపోయే వారికి ఈయన ఉచిత సలహా ఇచ్చారు.
ఇటీవల కాలంలో సెలెబ్రెటీల నుంచి మొదలుకొని ఎంతోమంది ప్రేమా పెళ్లిళ్లు చేసుకుని విడిపోతున్నారు అలాగే కొంతమంది రిలేషన్ లోనే ఉంటూ వారి రిలేషన్ కి బ్రేకప్ చెప్పుకుంటున్నారు ఇలా విడాకులు తీసుకొని విడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి అనే విషయం గురించి పూరి జగన్నాథ్ తెలియజేశారు. ఇటీవల కాలంలో అమ్మాయిలు, అబ్బాయిలు ఎక్కువగా సోషల్ మీడియాకు అడిక్ట్ అవ్వటం వల్ల విడాకులు జరుగుతున్నాయని తెలిపారు.
ముఖ్యంగా అమ్మాయిలైతే వారింట్లో ఏ చిన్న సంఘటన జరిగిన వెంటనే ఫోటోలు తీసి వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు దయచేసి అలా చేయటం మానేయండి. రిలేషన్ లో ఉన్నవారు అయినా కొత్తగా పెళ్లి చేసుకున్న వారైనా ముందు ఈ సోషల్ మీడియాకు దూరంగా ఉండండి మీ పార్ట్నర్ మీ ప్రపంచం అనుకొని బ్రతకండి అప్పుడే మీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది.
నేను చెప్పిన మాట వినండి ఇంట్లో సంతోషకరంగా ఉన్న బాధాకరంగా ఉన్న ఆ విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దు సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ మీ జీవిత భాగస్వామి మీ ప్రపంచమని బ్రతకండి ఎవరు కూడా విడాకులు తీసుకోలేరు అంటూ పూరి జగన్నాథ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.