మళ్లీ చేతులు కలపబోతున్న పూరీ – విజయ్ దేవరకొండ.!

ఒక్క సినిమా దెబ్బకి అడ్రస్‌లు గల్లంతైపోయాయ్ అటు విజయ్ దేవరకొండకీ, ఇటు పూరీ జగన్నాధ్‌కి. ‘లైగర్’ ఈ కాంబినేషన్‌కి తీరని నష్టం చేసింది. పూరీ, రౌడీతో పాటూ నిర్మాతగా ఛార్మికీ కూడా తీరని నష్టమే. అయితే, ఈ కాంబినేషన్ మళ్లీ సెట్ కాబోతోందనీ తాజా సమాచారం. ‘లైగర్’ టైమ్‌లోనే అంతా బాగుంటే, వెంటనే ‘జనగణమన’ సినిమా పట్టాలెక్కేసి వుండేది.

‘లైగర్’ రిజల్ట్‌తో ఆ ప్రాజెక్ట్ పక్కకెళ్లిపోయింది. ఇక, ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్ టేకప్ చేయబోతున్నాడట పూరీ జగన్నాధ్ రౌడీ విజయ్ దేవరకొండ కోసం. అయితే, ఈ సారి తాను డైరెక్షన్ రిస్క్ తీసుకోడట. కేవలం కథ మాత్రమే అందిస్తాడనీ తెలుస్తోంది. ఓ యంగ్ డైరెక్టర్‌ని ఈ సినిమాతో పరిచయం చేయబోతున్నాడనీ తెలుస్తోంది. చూడాలి మరి, ఈ గాసిప్‌లో నిజమెంతో.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘ఖుషీ’ సినిమా చేస్తున్నాడు. సమంత కారణంగా ఈ సినిమా ఆలస్యమవుతూ వస్తోంది. రీసెంట్‌గా తాజా షెడ్యూల్ కోసం ముస్తాబయ్యింది ‘ఖుషీ’. అలాగే, చిరంజీవి సినిమా కోసం పూరీ జగన్నాధ్ ప్రయత్నిస్తున్నాడు.