ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ మరోసారి సత్తా చాటింది. ముంబయి ఇండియన్స్‌పై విజయం సాధించి లీగ్ దశను అగ్రస్థానంలో ముగించింది. ఈ గెలుపుతో పంజాబ్ క్వాలిఫయర్-1కి అర్హత పొందగా, ముంబయి ఎలిమినేటర్ మ్యాచ్‌కు పరిమితమైంది. ముంబయితో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి 20 ఓవర్లలో 184 పరుగులు చేయగా, పంజాబ్ 18.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. పంజాబ్ విజయంలో ప్రియాంశ్ ఆర్య (62; 35 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), జోష్ ఇంగ్లిస్ (73; 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అద్భుతంగా రాణించారు. ప్రారంభంలో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (13) స్వల్ప స్కోరుతో వెనుదిరిగినప్పటికీ, శ్రేయస్ అయ్యర్ (26*) జట్టును గెలిపించే వరకు నిలబడ్డాడు.
ముంబయి బౌలర్లలో మిచెల్ శాంట్నర్ రెండు వికెట్లు, బుమ్రా ఒక వికెట్ తీసారు. బౌలింగ్ విభాగంలో పంజాబ్ కూడా మెరుగైన ప్రదర్శన చూపింది. యాన్సెన్, అర్ష్‌దీప్, వైశాఖ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ముంబయి ఇన్నింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ (57) ఒక్కడే పోరాడాడు. రోహిత్ శర్మ (24), రికెల్‌టన్ (27) ప్రారంభంలో జాగ్రత్తగా ఆడినా, పెద్ద స్కోరు చేయలేకపోయారు. హార్దిక్ పాండ్యా (26), నమన్ ధీర్ (20) తమ వంతుగా కొంత సమర్థించారు. ఐతే కీలక దశల్లో వికెట్లు కోల్పోవడంతో ముంబయికి పెద్ద స్కోరు సాధించలేకపోయింది. ఇప్పుడు ఆర్సీబీ విజయం మీద ఆధారపడి ముంబయికి ఎలిమినేటర్‌లో ఎదురయ్యే ప్రత్యర్థి తేలనుంది.