పునీత్ అకౌంట్ ని అన్ వెరిఫైడ్ చేసిన ట్విట్టర్… ఆగ్రహంలో ఫ్యాన్స్..!

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొంతకాలం క్రితం కార్డియాక్ అరెస్ట్ వల్ల పునీత్ రాజ్ కుమార్ ప్రాణాలు కోల్పోయాడు. అతి చిన్న వయసులోనే ఇలా తమ అభిమాన హీరో హఠాత్తుగా మరణించడంతో పునీత్ అభిమానుల బాధ వర్ణనాతీతంగా మారింది. ఇదిలా ఉండగా ఇటీవల పునీత్ రాజ్‌కుమార్ ట్విట్టర్ అకౌంట్ అన్ వెరిఫైడ్ గా చూపించటంతో పునీత్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ట్విట్టర్ సంస్థ పునీత్ ట్విట్టర్ అకౌంట్ ను అన్ వెరిఫైడ్ చేస్తూ అతని పేరు ముందు ఉన్న బ్లూ టిక్ ను తొలగించింది. దీంతో పునీత్ అభిమానులు ట్విట్టర్ పై ఫుల్ ఫైర్ అవుతున్నారు.

ట్విట్టర్ యాజమాన్యం చేసిన చర్యకు పునీత్ అభిమానులు ఫుల్ ఫైర్ అవుతున్నారు. బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌, సిద్ధార్థ్ శుక్లా చనిపోయిన తర్వాత కూడా వారికి గౌరవసూచకంగా ట్విట్టర్ వెరిఫైడ్ ఖాతాలుగా వారి అకౌంట్స్ ను కొనసాగిస్తోంది. అయితే పునీత్ విషయంలో మాత్రం అన్ వెరిఫైడ్ చేసింది. ఈ క్రమంలో ట్విట్టర్ యాజమాన్యం ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఆడుకుంటుందని, ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని పునీత్ అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. పునీత్ ట్విట్టర్ అకౌంట్ ను వెంటనే వెరిఫై చేయాలని సీరియస్ అవుతున్నారు. .

ఇదిలా ఉండగా పునీత్ రాజ్ కుమార్ మరణించడానికి ముందు ఆయన నటించిన చివరి సినిమా ‘గంధాడగుడి’ . ఈ సినిమాకి పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా అక్టోబర్ 28న తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. జంతు సంరక్షణ సందేశం తో కర్ణాటక వైల్డ్ లైఫ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కింది. పునీత రాజ్ కుమార్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ సినిమా కోసం అతని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా అక్టోబర్ 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది.