పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణం నేను ఎప్పుడూ ఒప్పుకోను!

కన్నడ సూపర్‌ స్టార్‌ డా. శివరాజ్‌ కుమార్‌ అలియాస్‌ శివన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వందకుపైగా సినిమాల్లో నటించిన ఆయన కన్నడలో తిరుగులేని స్టార్‌డమ్‌ సంపాదించాడు. ఇటీవలే జైలర్ సినిమాలో కామియోలో కనిపించి అభిమానులను థ్రిల్‌ చేశాడు.

ఇక శివన్న నటిస్తున్న లేటెస్ట్‌ ఫిల్మ్‌ ‘ఘోస్ట్‌’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫప్ట్‌ లుక్‌, టీజర్‌, ట్రైలర్ లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. విజయదశమి కానుకగా.. అక్టోబర్‌ 19న పాన్‌ ఇండియా లెవల్లో ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కేరళకు వెళ్లిన శివరాజ్‌ కుమార్‌ ఒక ఈవెంట్‌లో తన తమ్ముడు దివంగత కన్నడ సూపర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ను గుర్తు చేసుకున్నారు.

‘ఘోస్ట్‌’. ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడుతూ.. పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణం నాకు ఎప్పటికీ ఒప్పుకోలేని విషయం. పునీత్‌ నాకంటే 12-13 ఏళ్లు చిన్నవాడు. నేను నా భావాలను వ్యక్తపరచలేను. నేనెప్పుడూ పునీత్‌ సమాధి వద్దకు వెళ్లను. ఎందుకంటే అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించరు . తాను అలాంటి పద్ధతులను నమ్మే వ్యక్తిని కాదని, పునీత్‌ చనిపోయానని తాను అంగీకరించగలిగితేనే ఇలాంటివి ఆలోచించడం, చేయడంలో అర్థం ఉంటుందని శివరాజ్‌ కుమార్‌ అన్నారు.

యాక్షన్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సందేశ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సందేశ్‌ నాగరాజ్‌ నిర్మిస్తున్నారు. అనుపమ్‌ ఖేర్‌, జయరామ్‌, ప్రశాంత్‌ నారాయణ్‌, అర్చన జాయిస్‌, సత్య ప్రకాష్‌, దత్తన్న ప్రధాన పాత్రలు పొషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో శివరాజ్‌ కుమార్‌ మొత్తం మూడు గెటప్స్‌లో అలరించనున్నాడు.