ప్రాజెక్ట్-కె పక్కకి వెళ్ళిపోయినట్టే.!

వచ్చే సంక్రాంతికి ఏయే సినిమాలు రాబోతున్నాయ్.? అన్నదానిపై బెట్టింగుల స్థాయిలో సినీ పరిశ్రమలో చర్చించుకుంటున్నారు. రావడానికైతే చాలానే వున్నాయ్.. అందులో ‘ప్రాజెక్ట్-కె’ అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా.

‘గుంటూరు కారం’ కూడా అంతే. మరి, ‘గేమ్ ఛేంజర్’ సంగతో.! అబ్బో.. లిస్టు తీసుకుంటే, ఐదారు.. కాదు కాదు.. ఏడెనిమిది పెద్ద సినిమాలే వున్నాయ్. ఓ రెండు పెద్ద సినిమాలు ఓ చిన్న సినిమా అయితే ఓకే. అదనంగా ఇంకో సినిమా ఓ మోస్తరు స్థాయిది అయినా ఓకే.

కానీ, పెద్ద సినిమాలన్నీ ఒకేసారి దండయాత్ర.. అంటే, అందరూ నష్టపోతారు. ఇక, అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ‘ప్రాజెక్ట్-కె’ సంక్రాంతి రేసు నుంచి దాదాపు తప్పుకున్నట్లేనట. ‘గేమ్ ఛేంజర్’ పరిస్థితి కూడా అంతేనట.

‘గుంటూరు కారం’ కూడా సంక్రాంతి రేసులోకి రాకపోవచ్చంటున్నారు. ఈమాత్రందానికి ఆయా హీరోల అభిమానుల అనవసరపు హంగామా ఎందుకంట.?