థియేట‌ర్స్‌కు జ‌నాలు కరువు.. తిరిగి తీసుకురావ‌డానికి ఈ నిర్ణ‌యం తీసుకుంటున్నారా?

క‌రోనా మ‌హ‌మ్మారి సినిమా ఇండ‌స్ట్రీకి అనేక క‌ష్టాల‌ను తీసుకొచ్చింది. వైర‌స్ వ‌ల‌న ఏడు నెల‌ల పాటు షూటింగ్స్ ఆగిపోగా, థియేట‌ర్స్ ఇప్ప‌టికీ తెరుచుకోలేదు. అయితే క‌రోనా మ‌హ‌మ్మారి ఉధృతి కాస్త తగ్గిన నేప‌థ్యంలో ఇప్పుడిప్పుడే స్టార్ హీరోలంద‌రు షూటింగ్స్‌ల‌లో పాల్గొంటున్నారు. వీరి సినిమాల‌ను వ‌చ్చే ఏడాదికి రిలీజ్ చేసే ఆలోచ‌న చేస్తున్నారు. అయితే అక్టోబ‌ర్ 15 నుండి 50 శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్స్ తెర‌చుకోవ‌చ్చ‌ని కేంద్ర ప్ర‌భుత్వం మార్గ ద‌ర్శ‌కాలు జారీ చేసినప్ప‌టికీ, సినిమా హాళ్లు తెరవడానికి థియేటర్స్ ఓనర్స్ ముందుకు రావడం లేదు. అలాగే సినిమాలు రిలీజ్ చేయడానికి మేకర్స్ కూడా వెనుకడుగు వేస్తున్నారు

ఇప్ప‌టికే సంక్రాంతికి రవితేజ ‘క్రాక్’.. అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. నితిన్ ‘రంగ్ దే’.. దగ్గుబాటి రానా ‘అరణ్య’.. రామ్ పోతినేని ‘రెడ్’ వంటి సినిమాలు రానున్నాయి అంటూ మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. కాని థియేట‌ర్స్ విడుద‌ల విష‌యంలో ఇప్ప‌టికీ క్లారిటీ లేక‌పోవ‌డంతో జనాల‌ని థియేట‌ర్స్‌కు ఎలా ర‌ప్పించాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఒక‌ప్ప‌టి రోజుల‌లో మాదిరి ప్ర‌చారాలు చేస్తే సత్ఫ‌లితం వ‌స్తుందా అని నిర్మాత‌లు ఆలోచిస్తున్నార‌ట‌.

మొన్న‌టి వ‌ర‌కు సినిమా రిలీజ్‌కు ముందు ఏదో తూతూ మంత్రంగా ఇంట‌ర్వ్యూలు ఇస్తే స‌రిపోయేది. కాని ఇప్పుడ‌లా కాదు. హీరో, హీరోయిన్స్ ప్ర‌మోష‌న్స్‌లో మ‌రింత ఎక్కువ‌గా ఇన్వాల్వ్ అయి సినిమాపై హైప్ తీసుకొస్తే త‌ప్ప జ‌నాలు థియేట‌ర్స్‌కు వ‌చ్చే ప‌రిస్థితి లేదు. మెయిన్ ఏరియాస్ కూడా తిర‌గాల్సి ఉంటుంది. మ‌రి నిర్మాత‌ల బాగు కోసం స్టార్స్ ఓ అడుగు ముందుకేసి ప్ర‌చారాల‌లో చురుకుగా పాల్గొంటారా లేదా అనేది చూడాలి.