ఆ హీరోయిన్‌ను చాలా మంది దాని గురించే అడుగుతున్నారట..!!

Priyanka Jawalkar ABout Entry Into Hollywood

ఒక్క సినిమా చాలు హీరో, హీరోయిన్ల ఫేట్ మారిపోవడానికి. అది మంచికైనా సరే చెడుకైనా సరే. ఒక్క సినిమాతో స్టార్ స్టేటస్ అనుభవించిన వారున్నారు. అదే ఒక్క సినిమాతో పాతాళంలో కూరుకుపోయిన వారున్నారు. అయితే తెలుగు భామలు ఎక్కువగా సక్సెస్ కాలేకపోతుంటారు. మన తెలుగు తెరపై మన అమ్మాయిలు మాత్రం అంతగా రాణించలేకపోతున్నారు. ఈ మధ్య కాలంలో ఓ మోస్తరుగా తెలుగు అందాలకు గిరాకీ పెరుగుతోంది.

Priyanka Jawalkar ABout Entry Into Hollywood
Priyanka Jawalkar ABout Entry Into Hollywood

ఈషా రెబ్బా, ప్రియాంక జవాల్కర్ వంటి వారు క్రేజీగా మారిపోయారు. టాక్సీవాలా చిత్రంతో ప్రియాంక బాగానే పేరు సంపాదించుకుంది. ఆ చిత్రంతో ప్రియాంకకు మంచి గుర్తింపు లభించింది. అయితే ఈ చిత్రం తరువాత మళ్లీ ప్రియాంక పలకరించలేకపోయింది. ప్రస్తుతం గమనం అనే బహు భాషా చిత్రంతో అందర్నీ మెప్పించేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి శ్రియ, నిత్య మీనన్ ఫస్ట్ లుక్స్ వచ్చేశాయి.

Priyanka Jawalkar ABout Entry Into Hollywood
Priyanka Jawalkar ABout Entry Into Hollywood

తాజాగా ఈ భామ నెటిజన్లతో ముచ్చట్లు పెట్టింది. ఏదైనా అడగండి అంటూ ఓపెన్ ఆఫర్ పెట్టేసింది. అందులో భాగంగా నెటిజన్లు ఎన్నో ప్రశ్నలు సంధించారు. అందులో ఓ నెటిజన్ నాని గురించి చెప్పండి అని అడిగాడు. నాని నవ్వు నాకిష్టం.. నిన్ను కోరి సినిమాను ఎన్నోసార్లు చూశాను అని ప్రియాంక తెలిపింది. ఇక తమిళ ఇండస్ట్రీకి ఎప్పుడు వస్తారు? అని అడిగిన ప్రశ్నకు సమాధానం.. చాలా మంది దాని గురించి అడుగుతున్నారు.. చూద్దాం త్వరలోనే అది కూడా అవుతుంది.. అంటూ ప్రియాంక తన అభిమానుల ప్రశ్నలకు సమాధానమిచ్చింది.