విజయ్ దేవరకొండ.. ఈ పేరు ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులతో దూసుకెళ్తున్న హీరోగా చర్చలోకి వస్తోంది. కానీ ఇటీవల విజయ్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా తన హిట్ సినిమా టాక్సీవాలాపై మరోసారి ఫోకస్ చేసేలా మారాయి. విజయ్ చెప్పినదాని ప్రకారం, ఆ సినిమా రిలీజ్ కాకముందే ఆపేయాలని నిర్ణయించినట్లు నిర్మాతలు భావించారట.
“టాక్సీవాలా షూటింగ్ టైంలో ప్రతీ సీన్ పూర్తయిన వెంటనే అవుట్‌పుట్ చూశాం. నవ్వులే నవ్వులు. ఎడిటింగ్ అయిపోయాక, ఫైనల్ కట్ సిద్ధమయ్యాక నేను ‘నోటా’ సినిమా కోసం చెన్నైలో ఉన్నా. అప్పుడే నాకు హ్యాదరాబాద్ రావాలని చెప్పారు” అని విజయ్ వివరించారు. మేకర్స్ లో ఉన్న టెన్షన్ తనకూ నెమ్మదిగా అర్థమైందని అన్నారు.
హైదరాబాద్ వచ్చి అల్లు అరవింద్‌ను కలిసినప్పుడు షాకింగ్ కామెంట్స్ వినాల్సి వచ్చిందని విజయ్ గుర్తుచేశారు. “సినిమా వర్కౌట్ అయ్యినట్లుగా లేదని, ఆపేయాలనుకుంటున్నామని అరవింద్ గారు చెప్పారు. సినిమా చూస్తే, స్క్రిప్ట్ విన్నప్పుడు ఎలా నవ్వొచ్చిందో ఇప్పుడు అర్థం కాలేదు. అసలు కారణం బ్యాక్ గ్రౌండ్ స్కోర్. అది కథతో పొలికే ఉండలేదు” అని చెప్పారు.
ఈ దశలో విజయ్, దర్శకుడు రాహుల్ సాంకృత్యన్‌తో కలిసి కొత్త మ్యూజిక్ డైరెక్టర్‌ను తీసుకుని రీ-రికార్డింగ్ చేయించాలని సూచించారట. ఆ బాధ్యత బిజోయ్‌కు అప్పగించగా, ఆయన పని సినిమా విజయంలో కీలకమైందని విజయ్ పేర్కొన్నారు. మొత్తానికి టాక్సీవాలా అనుకోని మలుపులు తిప్పుకుని, చివరకు విజయ్‌కు గుర్తుండిపోయే హిట్‌గా నిలిచిందని చెప్పొచ్చు.