పేరు చివర తన భర్త పేరు తొలగించిన ప్రియాంక చోప్రా.. కారణం అదేనా?

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో నటి ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించడమే కాకుండా మాజీ ప్రపంచ సుందరిగా గుర్తింపు సంపాదించుకుంది.ఇలా ఇండస్ట్రీలో తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె 2018 లో అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్ ల వివాహం రాజస్థాన్‌లోని హిస్టారికల్‌ ప్యాలెస్‌ జోద్‌పూర్‌ ఉమైద్‌ భవన్‌ ప్యాలెస్‌లో ఎంతో ఘనంగా జరిగింది.

ఇలా వివాహం అనంతరం ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఎన్నో సందర్భాలలో వీరి రొమాంటిక్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వీరి మధ్య ఉన్న ప్రేమను వ్యక్తపరిచారు. ఈ క్రమంలోనే వివాహం తర్వాత ప్రియాంక చోప్రా సోషల్ మీడియా అకౌంట్ లో తన పేరు చివరన తన భర్త పేరు రాసుకొచ్చారు. ఇదిలా ఉండగా తాజాగా నవంబర్ 22 వ తేదీ ప్రియాంక చోప్రా తన అభిమానులకు ఊహించని విధంగా షాక్ ఇచ్చింది.

ఈ క్రమంలోనే తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో తన పేరులో ఉన్నటువంటి తన భర్త పేరు జోనాస్ ను తొలగించడంతో నెటిజన్లు పెద్దఎత్తున సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.ఈ క్రమంలోనే ప్రియాంక చోప్రా అచ్చం సమంత మాదిరిగానే విడాకులకు ముందు తన భర్త ఇంటి పేరును తొలగించినట్టు ప్రియాంక చోప్రా కూడా తన భర్త పేరును తొలగించింది అంటే సమంత నాగచైతన్య మాదిరిగానే ఈ జంట కూడా విడాకులకు సిద్ధమయ్యార అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రియాంక చోప్రా తన భర్త పేరును తొలగించడానికి గల కారణం ఏంటో తెలియాల్సి ఉంది.