ఇండియాకు ప్రియాంక చోప్రా గుడ్‌బై?

బాలీవుడ్‌ సుందరి, మిస్‌ వరల్డ్‌ 2000, పద్మశ్రీ ప్రియాంకా చోప్రా గుడ్‌బై చెబుతుందా అంటే అవుననే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. 2002లో తమిళ చిత్రంతో సినిమాల్లో అడుగుపెట్టిన ఆ అమ్మడు ఇక ఆ తర్వాత బాలీవుడ్‌లో అడుగుపెట్టి 2017 వరకు ఆగ్ర కథానాయికగా రాణించింది. 2017లో బే వాచ్‌ సినిమాతో హాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ అమ్మడు ఆ తర్వాత వరుసగా అక్కడి సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు చేస్తు చేతి నిండా ఆఫర్లతో దూసుకుపోతున్నది.

ఈ క్రమంలో 2018లో హాలీవుడ్‌ నటుడు, సింగర్‌ తనకన్నా చిన్నవాడైనా నిక్‌ జోనాస్‌ను వివాహం చేసుకున్న ఆమె అక్కడే స్థిరపడిరది. ఇక అప్పటినుంచి బాలీవుడ్‌లో అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తున్నది. 2021లో వచ్చిన వైట్‌ టైగర్‌ అనే సినిమాలో చివరగా కనిపించిన ఈ అమ్మడు పెళ్లి తర్వాత ఐదేండ్లలో చేసింది రెండు హిందీ సినిమాలే కావడం గమనార్హం.

పూర్తిగా ఇంగ్లీష్‌ సినిమాలపైనే దృష్టి పెట్టిన ప్రియాంక ముంబైలోని దీంతో ముంబైలోని తన కలల సౌధమైన తన ఇంటిని అమ్ముకోవడమే కాక తన రెండు ప్రాపర్టీలను అమ్మేసినట్లు తెలుస్తోంది. అంధేరిలోని అపార్ట్‌మెంట్‌ తొమ్మిదో ఫ్లోర్‌ను దాదాపు రూ.6 కోట్లకు అమ్మగా 36 లక్షల స్టాంప్‌ డ్యూటీ చెల్లించినట్లు వార్తలు వచ్చాయి.

దీంతో పాటు మరో రెండు ఖాళీ స్థలాలను కూడా అమ్మేశారని, ఈ వ్యవహారాలన్నింటినీ ప్రియాంక తల్లి మధు చోప్రా చూసుకున్నట్లు సమాచారం. దీంతో హిందీ ఇండస్ట్రీ వదిలి వెళుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్నది. తాజాగా ప్రియాంక హాలీవుడ్‌ స్టార్‌ నటుడు ఇద్రీస్‌ ఎల్బాతో కలిసి ఎడ్స్‌ ఆఫ్‌ స్టేట్‌ అనే యాక్షన్‌, కామెడీ చిత్రం చేస్తున్నది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రియాంక నెట్‌ వర్త్‌ రూ. 650 కోట్ల వరకు ఉంది.