దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. ఈ మహమ్మారి సాధారణ ప్రజలతోపాటు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీలని సైతం పొట్టనబెట్టుకుంటోంది. అయితే కొందరు మాత్రం కరోనా నుండి త్వరగానే కోలుకుంటున్నారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, కరోనా బారిన పడడం కొందరిని కలవరపరుస్తుంది.ఇటీవల మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఆయన ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. ఐసోలేషన్‌కు వెళ్లాను. త్వరగా కోలుకొని మళ్ళీ మీ ముందుకు వస్తానని అన్నారు.
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ తన సోషల్ మీడియాలో … నేను అక్టోబర్ 7 నుండి జనగణమన అనే చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నాను. షూటింగ్ సమయంలో కరోనా జాగ్రత్తలు అన్ని పాటించాం. నిబంధనల ప్రకారం షూటింగ్‌లో పాల్గొనేముందు అందరం కరోనా పరీక్షలు చేయించుకున్నాం. షూటింగ్ పూర్తైన తర్వాత పరీక్షలు చేయించుకుంటే దురదృష్టవశాత్తు రిజల్ట్స్ లో పాజిటివ్ అని వచ్చింది. దీంతో వెంటనే ఐసోలేషన్‌కు వెళ్ళాను. నాతో కాంటాక్ట్‌లో ఉన్న వారు తప్పని సరిగా పరీక్షలు చేయించుకోండని కోరారు పృథ్వీరాజ్.
మాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కరోనాను జయించారు. ఈ విషయాన్నిఆయన తన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. యాంటీజెన్ పరీక్షలలో నెగెటివ్‌గా తేలింది. పూర్తిగా కోలుకోవాలంటే మరో వారం రోజులు ఐసోలేషన్‌లో ఉండాలి. నా ఆరోగ్యం గురించి ఆరా తీసిన వారందరికీ చాలా థ్యాంక్స్. మీ ప్రేమ, అభిమానాలకి కృతజ్ఞుడిని అంటూ పృథ్వీరాజ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కరోనా నెగిటివ్ సర్టిఫికేట్‌ను కూడా ఆయన అభిమానులతో పంచుకున్నారు. ఇదిలా ఉంటే పృథ్వీరాజ్ ‘ఆదుజీవితం’ షూటింగ్ నిమిత్తం జోర్డాన్‌కి వెళ్ళగా, లాక్‌డౌన్ వలన దాదాపు రెండు నెలలు అక్కడే ఉండిపోయాడు. భారత్ చేపట్టిన వందే భారత్ మిషన్‌లో భాగంగా ‘ఆదుజీవితం’ చిత్ర బృందం మే 22న ప్రత్యేకం విమానంలో భారత్ తిరిగొచ్చారు. అప్పుడు ఆయనకు కరోనా పరీక్ష నిర్వహించగా నెగెటివ్ అని తేలింది.