RRR – మరో ఇంటర్నేషనల్ అవార్డ్స్ లో అవార్డుల పంట.!

RRR

ఇప్పుడు తెలుగు సినిమాకి మరియు భారత దేశ చలన చిత్ర పరిశ్రమ దగ్గర అయితే గర్వించదగ్గ సినిమాగా నిలిచిన సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా ఆర్ ఆర్ ఆర్ సినిమానే అని చెప్పాలి. జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సెన్సేషనల్ మాస్ మల్టీ స్టారర్ సినిమా భారీ అంచనాలు మధ్య వచ్చి తెలుగులో ఎన్నో రికార్డులు కొల్లగొట్టింది.

మరి ఇప్పుడైతే ఈ భారీ సినిమా ఇంటర్నేషనల్ సినిమా దగ్గర ముద్ర వేసింది. ఇన్నేళ్ల భారతీయ సినిమా నుంచి ఏ సినిమా కూడా అందుకోని గుర్తింపు ఈ సినిమా అందుకోగా ఈ సినిమా పలు అంతర్జాతీయ పురస్కారాలు అందుకొని ఇప్పుడు ఆస్కార్ కి అడుగు దూరంలో నిలిచింది.

మరి ఈరోజు తాజాగా మరో ప్రముఖ హాలీవుడ్ అవార్డ్స్ లో సత్తా చాటి గర్వకారణంగా నిలిచింది. మరి ఈ సినిమాకి హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ వారు అనౌన్స్ చేసిన అవార్డ్స్ లో నాలుగు విభాగాల్లో అయితే ఈ సినిమా అవార్డులు గెలిచింది. మరి ఆర్ ఆర్ ఆర్ అయితే బెస్ట్ ఇంటర్నేషనల్ సినిమా, బెస్ట్ ఏక్షన్ చిత్రం అలాగే బెస్ట్ స్టంట్స్ మరియు బెస్ట్ సాంగ్ విభాగాల్లో నాలుగు అవార్డులు ఈ సినిమా సొంతం చేసుకొని అదరగొట్టింది.

దీనితో చిత్ర యూనిట్ విపరీతమైన ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఈవెంట్ లో ఎస్ ఎస్ రాజమౌళి రామ్ చరణ్ మరియు సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి లు హాజరయ్యారు. అక్కడ కూడా ఫారిన్ ఆడియెన్స్ లో భారీ అప్లాజ్ అందించారు.