ప్రైడ్ RRR : హాలీవుడ్ నుంచి ఆగని అవార్డుల వరద.!

మన తెలుగు సినిమా కొన్నేళ్ల తర్వాత కూడా ఎంతో గర్వంగా చెప్పుకునే రేంజ్ లో ప్రపంచం వ్యాప్తంగా నిలబెట్టిన చిత్రం ట్రిపుల్ ఆర్(RRR). దర్శకుడు రాజమౌళి స్టార్ హీరోలు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాఠీ హీరోలుగా చేసిన ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఇప్పుడు వరల్డ్ వైడ్ ఎలాంటి రచ్చ లేపుతుందో చూస్తున్నాం.

రీసెంట్ గానే న్యూయార్క్ ఫిలిమ్స్ క్రిటిక్స్ అవార్డు ఈ చిత్రం అందుకోవడంతో డెఫినెట్ గా ఆస్కార్ రేస్ లో ఈ చిత్రం టికెట్ ని ఖాయం చేసుకుంది. ఇక దీని తర్వాత నిన్ననే అట్లాంటా ఫిలిం క్రిటిక్స్ వారి నుంచి కూడా ఓ ఇంటర్నేషనల్ అవార్డు అందించగా.. 

దీని తర్వాత మళ్ళీ మరో ఇంటర్నేషనల్ అవార్డు అయితే ఈ చిత్రం హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ వారు కూడా బెస్ట్ సినిమాగా తాము ఎంపిక చేసినట్టుగా అనౌన్స్ చేశారు. దీనితో అయితే హాలీవుడ్ నుంచి ఈ చిత్రం అవార్డుల వరద ఆగట్లేదని చెప్పాలి.

అయితే వీటి తర్వాత ఈ చిత్రం ఆస్కార్ కి మరింత దగ్గర ఉన్నట్టే చెప్పి తీరాలి. మరి అందరు కోరుకుంటున్న ఈ ఆస్కార్ RRR ని వరిస్తుందో లేదో చూడాలి.