‘కార్తీకదీపం’ వంటలక్క విశ్వరూపం.. నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్!!

కార్తీక దీపం సీరియల్ గురించి తెలియని వారు వినని వారు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరైనా ఉంటారా? అంటే ఆశ్చర్య కలుగుతుంది. సీరియల్ చూడని వారికైనా సరే కార్తీక దీపం క్రేజ్, వంటలక్క పాపులార్టీ, డాక్టర్ బాబు పాత్ర శౌర్య-హిమల గురించి తెలుస్తుంది. హాలీవుడ్ సూపర్ హీరోలు అందరికీ ఎలా సుపరిచితమో కార్తీక దీపం సీరియల్ పాత్రలు కూడా అంతే ఫేమస్. అయితే ఇందులో వంటలక్క దీప పాత్రల్లో ప్రేమీ విశ్వనాథ్ మాత్రం తిరుగులేని స్టార్డంను సొంతం చేసుకుంది.

తెలుగు మహిళల ఆత్మ గౌరవం ఉట్టిపడేలా కట్టుబొట్టూ ఉంటుంది. రంగులో కాదు గుణంలో అందం ఉంటుందని పరోక్షంగా చెప్పేందుకు ప్రేమీ విశ్వనాథ్‌ మేకప్ ఉంటుంది. ఆ పాత్రకు తగ్గట్టు కట్టుబొట్టూ ఆమె నటన ఉండటంతో ప్రతీ మహిళా వంటలక్క అలియాస్ దీపను అభిమానిస్తుంటారు. అయితే బయట మాత్రం ప్రేమీ విశ్వనాథ్‌ను చూసిన వారెవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. మామూలుగా ఈమె బయటకు రాదు.

ఆ మధ్య ఏదో ఒక అవార్డ్ ఫంక్షన్‌లో మెరిసింది. అక్కడ ఆమెను చూసిన వారంతా ఫ్లాట్ అయ్యారు. తాజాగా మరో ఈవెంట్‌లో వంటలక్క దుమ్ములేపేందుకు రెడీ అవుతోంది. ప్రతీ పండుగల చానెల్ వాళ్లు స్పెషల్ ఈవెంట్లు చేస్తుంటారు. జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు, బిగ్ బాస్ కంటెస్టెంట్లతో ఈవెంట్లు ప్లాన్ చేస్తుంటారు. ఈ సారి స్టార్ మా దసరాకు జాతరో జాతర అనే ఈవెంట్ చేయబోతోంది. ఇందులో ప్రేమీ విశ్వనాథ్ అమ్మోరుగా నటించింది. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో ప్రేమీ విశ్వనాథ్ అమ్మోరుగా జీవించేసింది. చూసిన ఆ పది క్షణాల్లోనే అందర్నీ భయపెట్టేసింది. ఇక ఈ ఈవెంట్లో వంటలక్కదే పై చేయి అయ్యేలా కనిపిస్తోంది.