200 కోట్లు.! కష్టం ‘సలార్’.!

ప్రభాస్ ‘సలార్’ సినిమా మీద బెట్టింగులు చాలా జోరుగా సాగుతున్నాయి. కేవలం తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ 200 కోట్లు అట.! అలాగని ప్రచారం జరుగుతోంది. నిర్మాతలు ఆ మొత్తాన్ని డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఆశిస్తున్నారట.

ఎవరు, తెలుగులో ‘సలార్’ సినిమాని విడుదల చేస్తారు.? దిల్’ రాజు, అల్లు అరవింద్.. ఇలా పెద్ద తలకాయలు బరిలో వున్నాయన్న ప్రచారమైతే జరుగుతోంది. మైత్రీ సంస్థ కూడా కొంత ఉత్సాహం ప్రదర్శిస్తున్నట్లే కనిపిస్తోంది.

మొన్నటికి మొన్న ‘ఆదిపురుష్’ విషయంలో ఏం జరిగిందో చూశాం. ఈసారి కూడా అలాంటి ‘కూటమి’ తప్పేలా లేదు. అయితే, 200 కోట్ల బెట్టింగ్ అంటే, ఒకింత తటపటాయిస్తున్నారు. ‘ఆదిపురుష్’ పలితమే అందుక్కారణం.

‘సాహో’, ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’.. వీటి తర్వాత వస్తున్న సినిమా కదా, ‘సలార్’ మీద అందుకే, బెట్టింగ్ విషయమై భయపడుతున్నారట. అద్గదీ అసలు సంగతి.