తెలుగు హీరో సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు హిందీలో ఒక రికార్డు కొట్టాడు. వివరంలోకి వెళితే … సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ప్రతి రోజు పండుగే వచ్చి సంవత్సరం దాటిపోయింది . అయినా కూడా రికార్డుల పరంపర కొనసాగుతుంది. థియేటర్లలో పర్వాలేదు అన్నట్లుగా వసూళ్లు సాధించినప్పటికి శాటిలైట్ ద్వారా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. స్టార్ హీరోలు సూపర్ స్టార్ హీరోల సినిమాలకు పోటీగా నిలిచి రేటింగ్ విషయంలో ఈ ఏడాదిలోనే టాప్ లో నిలిచింది.మంగళవారం నాడు ట్విట్టర్ లో తేజ్ తన మూవీ ప్రతి రోజు పండుగే గురించి ఒక ఆసక్తికరమైన ట్విట్ వేసాడు. ప్రతి రోజు పండుగే హిందీ డబ్ వెర్షన్ ఒక రికార్డు నమోదు చేసినట్లుగా ఆ ట్విట్ లో సారాంశం.
— Sai Dharam Tej (@IamSaiDharamTej) November 17, 2020
‘ప్రతి రోజు పండుగే ‘ సినిమాను హిందీలో డబ్ చేసి “హర్ దిన్ దివాళీ” పేరిట విడుదల చేశారు. యూట్యూబ్ లో పోస్ట్ అయిన 24 గంటల్లో ఈ సినిమాకు ఏకంగా 11 మిలియన్ ల వ్యూస్ వచ్చాయి. తెలుగు సినిమాల్లో ఇప్పటి వరకు కేవలం విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమాకు మాత్రమే ఆ రికార్డు దక్కింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ సరసన సుప్రీం స్టార్ నిలిచాడు. ఇద్దరు కూడా 24 గంటల్లోనే 11 మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకుని టాలీవుడ్ నుండి టాప్ హీరోలుగా నిలిచారు. హర్ దిన్ దీవాళీ అంటూ టైటిల్ ఉండటం వల్ల సినిమాపై ఉత్తరాది జనాల్లో ఆసక్తి కలుగుతున్నట్లుగా ఉంది. అందుకే సినిమాను ఎక్కువ మంది చూస్తున్నారు.