యష్ బర్త్ డే కి కేజీఎఫ్ 2 నుంచి భారీ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న ప్రశాంత్ నీల్ ..!

యష్ .. కేజీఎఫ్ ఛాప్టర్ తో ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు. దర్శకుడు ప్రశాంత్ నీల్ పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ గా విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు. కేజీఎఫ్ 1 తో ప్రశాంత్ నీల్ – యష్ లకి వచ్చిన పాపులారిటీ తో నిర్మాతలు ఈ సినిమా కి సీక్వెల్ ని నిర్మించాలని డిసైడయ్యారు. అనుకున్నదే ఆలస్యం ప్రశాంత్ నీల్ – యష్ కాంబినేషన్ లో కేజీఎఫ్ ఛాప్టర్ 2 మొదలు పెట్టారు. ఫస్ట్ పార్ట్ కంటే కేజీఎఫ్ 2 భారీ స్థాయిలో తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా మీద దేశ వ్యాప్తంగా అసాధారణమైన బజ్ క్రియేట్ అయింది.

K.G.F: Chapter 1 Visual Effects Breakdowns – VFX Online

కాగా ఈ సినిమా నుంచి టీజర్ కోసం ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవంగా ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. లాక్ డౌన్ కి ముందే దాదాపు చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయింది. అయితే ఈ సినిమాలో అధీరా గా నటిస్తున్న సంజత్ దత్ అనారోగ్యం తో షూటింగ్ లో పాల్గొనలేకపోయాడు. ఈ కారణంగా కూడా సినిమా చిత్రీకరణ కొంత ఆలస్యం అయింది. కాగా ఎట్టకేలకి రీసెంట్ గా కెజీఎఫ్ 2 షూటింగ్ కంప్లీట్ అయింది.

KGF Chapter 2 Movie Review Cast Release Date, Trailer and Budget - See  Latest

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ టీజర్ ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. అయితే ఈ టీజర్ ని రాకింగ్ స్టార్ యష్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి భారీ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడట. ఆ రోజు జనవరి 8 అని ఆ రోజు కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని అంటున్నారు. యష్ బర్త్ డే జనవరి 8 కావడం తో ఫ్యాన్స్ ఇప్పటి నుంచే సంబరాలు చేసుకుంటున్నారట. ఇక బాహుబలి తర్వాత మళ్ళీ పాన్ ఇండియన్ సినిమాగా కెజీఎఫ్ కి ప్రపంచ స్థాయిలో అంతటి క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాని హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తుండగా సమ్మర్ లో రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం.