ప్రభాస్ ఫ్యాన్స్ కి షాకిచ్చిన ప్రశాంత్ నీల్..!

prabhas_salaar_prashanth_neel_shoot_

ఇప్పుడు నో డౌట్ గా ఓ తెలుగు హీరో నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ రిలీజ్ ఏదన్నా ఉంది అంటే ఆ చిత్రం ఖచ్చితంగా ప్రభాస్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రం సలార్ సీజ్ ఫైర్ అనే చెప్పాలి. కాగా ఈ చిత్రాన్ని సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు.

అయితే ఈ సినిమా విషయంలో నీల్ తన కేజీఎఫ్ సినిమాలకి మించి పదింతలు ఏక్షన్ కానీ వైలెన్స్ కాని ఉంటాయి అని ఎపుడో చెప్పాడు. అయితే ఈ సినిమా విషయంలో అన్నిటికి మించిన పేద ప్రశ్న ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా అసలు కేజీఎఫ్ సినిమాలకి లింక్ ఉందా లేదా అని చెప్పుకోవాలి.

మొదటి నుంచి కూడా ఈ రెండు సినిమాలకి లింక్ ఉందనే కోణంలోనే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఇప్పుడు ఈ అంచనాలు ఇప్పుడు తలకిందులు అయ్యాయని చెప్పాలి. ఎందుకంటే ఈ చిత్రానికి కానీ కేజీఎఫ్ చిత్రాలకి ఎలాంటి లింక్ లేదని నీల్ తాజాగా బాలీవుడ్ మీడియాలో రివీల్ చేసాడు.

సలార్ రెండు సినిమాలుగా మాత్రమే వస్తుంది అని అందులో కేజీఎఫ్ కి ఎలాంటి లింక్ లేదని తాను చెప్పేసాడు. మరి ఇది అండగా సస్పెన్స్ ని హోల్డ్ లో ఉంచడానికి చెప్పాడా లేక నిజంగానే లింక్ లేదా అనేది మాత్రం  రిలీజ్ రోజునే తెలుస్తుంది. అయితే ఒకవేళ లింక్ లేకపోతె మాత్రం ప్రశాంత్ నీల్ ఫ్రాంచైజ్ కోసం చూస్తున్న వారికి పెద్ద డిజప్పాయింట్మెంట్ వార్త అని చెప్పక తప్పదు. మరి ప్రశాంత్ నీల్ అయితే ఏం చేసాడో తెలియాలి అంటే ఈ డిసెంబర్ 22 వరకు ఆగక తప్పదు.