ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర ఉన్న ఎన్నో భారీ చిత్రాలు అండ్ సెన్సేషనల్ కాంబినేషన్ లలో సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కాంబినేషన్ కూడా ఒకటి అని చెప్పాలి. ఎన్టీఆర్ మరియు దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “దేవర”.
దీని అనంతరం ఎన్టీఆర్ కెరీర్ లో 31వ సినిమాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ దీనిని తెరకెక్కిస్తుండగా ఫ్యాన్స్ లో భారీ హైప్ ఈ సినిమాపై నెలకొంది. అయితే ఈ సినిమా విషయంలో తాజాగా ఒక డిఫరెంట్ అప్డేట్ ని ప్రశాంత్ నీల్ ఇచ్చినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. తాను ఈ సినిమా కోసం ఏమన్నాడంటే.
“ఇలాంటి కథ ఎమోషన్స్ ఉన్న దానిని నేను ఇప్పటివరకు చెయ్యలేదు. చాలా మంది ఈ సినిమాని ఒక ఏక్షన్ సినిమా అనుకోవచ్చు. కానీ ఇది నాకు పూర్తిగా కొత్తది అని చివరగా ఈ సినిమా చూసిన వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను అని అనుకుంటున్నాను” అని ఈ సినిమా కోసం ఆసక్తికర అంశాన్ని రివీల్ చేసాడు.
అయితే తాను ఎక్కువ ఇది రెగ్యులర్ సినిమా అయితే కాదని డిఫరెంట్ ప్రాజెక్ట్ అని మెన్షన్ చేయడం విశేషం. మరి ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఇంకా ఈ సినిమాని భారీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నీల్ దర్శకత్వం వహించిన సలార్ చిత్రాన్ని కూడా వారే నైజాంలో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు.