మరోసారి “హనుమాన్” దర్శకుడి ఓవర్ కాన్ఫిడెన్స్.. 

ప్రస్తుతం టాలీవుడ్ సినిమా దగ్గర మాత్రమే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో కూడా అదరగొడుతున్న తెలుగు సినిమా “హనుమాన్” కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించగా తేజ సజ్జ హీరోగా అమ్రిత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. కాగా ఈ చిత్రంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకోగా ఈ సినిమా రిలీజ్ తర్వాత తనని తక్కువ అంచనా వేసిన వారిని తప్పని ప్రూవ్ చేసాడు.

కాగా ఈ భారీ చిత్రం అనంతరం ప్రశాంత్ వర్మ చేసిన మరో కామెంట్స్ వైరల్ గా మారాయి. ప్రశాంత్ వర్మ కొన్ని సార్లు చేసిన కామెంట్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ లా చాలా మందికి అనిపించాయి. తనకి బడ్జెట్ టైం ఇస్తే అవతార్ లాంటి సినిమా తీసి చూపిస్తాను అన్నపుడు చాలా మంది ట్రోల్స్ కూడా చేశారు.

కానీ ఒక్కసారి హనుమాన్ లో విజువల్స్ చూసాక అతడిలో విషయం ఉందని అనుకున్నారు. కానీ దీని తర్వాత చేసిన మరో స్టేట్మెంట్ కొంచెం ఓవర్ గానే ఉందని మళ్ళీ కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాగా ఈసారి తాను ఏమన్నాడంటే ఇది వరకు ఇండియాలో ఏవన్నా హాలీవుడ్ సినిమాలు రిలీజ్ అయితే ఏ సినిమా వస్తుంది అని మాట్లాడుకుంటున్నామో అలాగే హాలీవుడ్ లో ఒక టైం కి ఇండియా నుంచి ఏ సినిమా వస్తుంది అనే స్థాయిలో పని చేస్తాను అని తెలిపాడు.

దీనితో మరోసారి తనపై కామెంట్స్, మరీ ఓవర్ గా చేస్తున్నాడు అని ట్రోల్స్ మొదలయ్యాయి. ఒకవేళ తాను అన్నట్టుగానే చేసి చూపిస్తే మళ్ళీ వాళ్ళే సైలెంట్ అయిపోతారు.