Teja Sajja: టాలీవుడ్ హీరో తేజా సజ్జా గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం హీరో తేజా వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో తేజా నటిస్తున్న సినిమాలో అన్ని కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలుస్తున్నాయి. కాగా ఇటీవల హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న తేజా సజ్జా తాజాగా మిరాయ్ అనే సినిమాతో మరో భారీ విజయాన్ని దక్కించుకున్నాడు. మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించారు.
సెప్టెంబర్ 12న విడుదలైన ఈ చిత్రం కేవలం వారం రోజుల్లోనే రూ. 112 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. మిరాయ్ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్నారు తేజా సజ్జా. అయితే ఇప్పుడు అదే ఊపుతో తన తర్వాతి సినిమాలను ప్రకటించాడు. కాగా అవన్నీ కూడా సీక్వెల్స్ కావడం విశేషం. మిరాయ్ సినిమా తర్వాత తేజా సజ్జా నుంచి రానున్న చిత్రాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తుండగా తాజాగా ఆ సినిమాల గురించి రివీల్ చేశాడు. మూడు సినిమాల సీక్వెల్స్ ను ఆయన ప్రకటించాడు. మిరాయ్, జై హనుమాన్, జాంబీరెడ్డి 2 సీక్వెల్స్ చిత్రాలు ఉంటాయని తేజా సజ్జా పంచుకున్నాడు.
మిరాయ్ సెకండ్ పార్ట్ కోసం కొన్ని ఐడియాలు సిద్ధంగా ఉన్నట్లు దర్శకుడు ఇప్పటికే చెప్పారు. హనుమాన్ సీక్వెల్ గురించి దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా ఇప్పటికే ప్రకటించారు. అయితే, పార్ట్1కు మించి వందరెట్లు భారీ స్థాయిలో జై హనుమాన్ ఉంటుందని ఆయన అన్నారు. కానీ, సీక్వెల్ లో తేజా సజ్జా హీరో కాదని క్లారిటీ ఇచ్చారు. సీక్వెల్ లో అతడు హనుమంతు పాత్రలో కనిపిస్తాడని చెప్పారు. అయితే ఆ సినిమా హీరో ఆంజనేయ స్వామి అని ట్విస్ట్ ఇచ్చారు. ఆ పాత్ర కోసం కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ఇప్పటికే ఎంపికైన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ను మైత్రి మూవీస్ నిర్మిస్తోంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ, తేజా కాంబినేషన్ లో వచ్చిన తొలి హిట్ మూవీ జాంబిరెడ్డి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు భారీ విజయాన్ని అందుకుంది. అయితే, సుమారు నాలుగేళ్ల తర్వాత ఈ చిత్రానికి కొనసాగింపుగా జాంబిరెడ్డి 2 ను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ పూర్తి అయినట్లు సమాచారం. అయితే, ఈ మూవీకి ప్రశాంత్ వర్మ కథను మాత్రమే అందిస్తారని దర్శకుడు ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదని చర్చ జరుగుతోంది. అయితే ఈ మూడు సినిమాలలో మొదట హీరోగా తేజా సజ్జా నే నటించిన విషయం తెలిసిందే. ఈ మూడు సినిమాలు 100 కోట్ల కలెక్షన్స్ ని దాటాయి.
Teja Sajja: ఫుల్ ఫామ్ లో ఉన్న తేజా సజ్జా.. ఒకేసారి మూడు పెద్ద సినిమాలు అనౌన్స్ చేసిన హీరో!
