సినీ నటి స్నేహ.. తెలుగు, తమిళ ప్రేక్షకులకి చాలా సుపరిచితం. తెలుగింటి సీతమ్మగా పేరు తెచ్చుకున్న స్నేహ.. పలు భాషలలో కథానాయికగా నటించి మెప్పించింది. ఇప్పుడు సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తుంది. ఆ మధ్య వినయ విధేయ రామ చిత్రంలో రామ్‌చరణ్‌కి వదినగా నటించిన స్నేహ రీసెంట్‌గా వచ్చిన తమిళ చిత్రం పటాస్‌లో మెరిసింది. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగా 2012లో తమిళ నటుడు ప్రసన్నని వివాహం చేసుకున్న ఈ అమ్మడు ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. 2015లో కొడుకు విహాన్ జన్మించగా, ఈ ఏడాది జనవరిలో కుమార్తె ఆద్యంతకు స్నేహ జన్మనిచ్చారు.
తాజాగా ఆద్యంతకు తలనీలాలు ఇచ్చే కార్యక్రమం చెన్నైలోని స్నేహ ఇంట్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను స్నేహ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో గుండుతో ఉన్న ఆద్యంతని స్నేహ ముద్దాడుతున్న ఫొటోతో పాటు తండ్రి,కొడుకుల ఫొటోలు నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోలకు నెటిజన్స్ ఆసక్తికరమైన కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే స్నేహ భర్త ప్రసన్న కూడా తెలుగు సినిమాలలో నటించాడు. సాయి ధరమ్ తేజ్ ‘జవాన్’లో కీలక పాత్ర పోషించిన ప్రసన్న .. విశ్వామిత్ర చిత్రంలోను కనిపించారు.
ఇక ఆ నాటి సీనియర్ స్టార్స్ అందరితో కలిసి నటించిన స్నేహ తొలివలపు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా స్నేహాకు అంత గుర్తింపు తేకపోయిన ఆ తర్వాత వచ్చిన ప్రియమైన నీకు చిత్రంతో స్నేహ అందరి దృష్టిని ఆకర్షించింది. హనుమాన్ జంక్షన్’, ‘వెంకీ’, ‘రాధాగోపాలం’, ‘శ్రీరామదాసు చిత్రాలు స్నేహని స్టార్ హీరోయిన్‌గా నిలబెట్టాయి. ప్రస్తుతం ‘వాన్’ అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో దుల్కర్ సల్మాన్, కళ్యాణి ప్రియదర్శన్, కృతి కర్బంద, ప్రియా భవాని శంకర్ హీరోహీరోయిన్లుగా చేస్తున్నారు.