ఇతిహాస పురుషుడు శ్రీరాముడు పుట్టిన అయోధ్యలో కొత్త అధ్యాయం లిఖితమైంది. 492 ఏళ్లు సాగిన పోరాటంకు నరేంద్ర మోదీ కొత్త అధ్యాయం లిఖించారు. విశిష్ట ముహూర్తం.. విశిష్ట వ్యక్తుల మధ్య.. విశిష్ట భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. వేద మంత్రాల నడుమ పూజ చేయగా, నవభారత నిర్మాణం, లోకకళ్యాణం కోసం, రామరాజ్యం కోసం త్వరలోనే రామాలయ నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు. అభిజిత్ ముహూర్తంలో పూజను నిర్వహించారు. 31 ఏళ్ల క్రితం తెచ్చిన 9 ఇటుకలతో శిలాపూజ నిర్వహించారు. ఆలయాన్ని అత్యద్భుతంగా నిర్మించాలని భావించిన ట్రస్ట్ రామ మందిర్ నిధి పేరుతో విరాళాలు సేకరిస్తోంది. ఇప్పుటికే ఎంతోమంది ప్రముఖులు తమ వంతుగా రామ మందిర్ నిర్మాణానికి విరాళాలు చేపడుతున్నారు.
రామ్ మందిర్ నిర్మాణానికి ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు తమ వంతు విరాళాలు అందించారు. బాపు బుట్టబొమ్మ ప్రణీత కూడా సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. కరోనా పాండమిక్ సమయంలో ఎన్నో విరాళాలు అందిచడమే కాక ఆకలితో ఉన్న వారికి సొంత ఖర్చుతో భోజనాలు పెట్టిన ప్రణీత ఇప్పుడు రామ మందిర నిర్మాణం కోసం లక్ష రూపాయలను ఇస్తున్నట్టు పేర్కొంది. అలానే విరాళాలు అందించాలని కోరుతూ ఓ వీడియోను ప్రణీత ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
కరోనా సమయంలో అనేక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ వచ్చిన ప్రణీత ఇటీవల మాల్దీవులకు వెళ్ళిన సంగతి తెలిసిందే. అక్కడ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి. ఇక ఒకప్పుడు తెలుగు సినిమాలతో బాగానే అలరించిన ప్రణీత ఇప్పుడు పెద్దగా టాలీవుడ్లో ఆఫర్స్ అందుకోలేకపోతుంది.
I’m making a humble initial pledge of Rs 1 lakh for the Ayodhya Ram Mandir nidhi samarpana abhiyaana. Requesting all of you to come join hands and be a part of this historic movement #RamMandirNidhiSamarpan pic.twitter.com/1mpTGan9q8
— Pranitha Subhash (@pranitasubhash) January 12, 2021