ఒక్క ఫోటోతో నోర్మూయించాడు.. కంగనా రనౌత్‌పై ప్రకాష్ రాజ్ సెటైర్

prakash raj counter to kangana ranaut,Prakash Raj

ప్రకాష్ రాజ్ తెరపై ఎన్ని రకాల పాత్రలను పోషించి ఎందరి మనసుల్లో స్థానం సంపాదించుకున్నాడో అందరికీ తెలిసిందే. ఆ భాష ఈ భాష అని లేకుండా అన్ని ప్రాంతాల అభిమానులు, అన్ని ఇండస్ట్రీల్లో విలక్షణ పాత్రలను చేసి మెప్పించాడు. ఇక రాజకీయ రంగంలోనూ తన దైన శైలిలో ప్రశ్నల బాణాల్ని సంధిస్తుంటాడు. సోషల్ మీడియాలో ప్రకాష్ రాజ్ వేసే ట్వీట్లు ఎంతగా ఆలోచింపచేస్తాయి.. ఎంతగా వివాదానికి దారితీస్తాయో అందరికీ తెలిసిందే.

prakash raj counter to kangana ranaut,Prakash Raj
prakash raj counter to kangana ranaut,Prakash Raj

జస్ట్ ఆస్కింగ్ పేరిట ప్రకాష్ రాజ్ రోజూ ట్వీట్లు చేస్తుంటాడు. తాజాగా ప్రకాష్ రాజ్‌ కంగనా రనౌత్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు. శివసేస ప్రభుత్వంతో గొడవలు, మహారాష్ట్రపై కామెంట్స్, తన కార్యాలయాన్ని కూలగొట్టడంపై ఫైర్ అవ్వడంతో కంగనా పేరు దేశ వ్యాప్తంగా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అయితే కంగనాకు ఓ వర్గం వారు మద్దతు ఇస్తున్నా.. గానీ కొందరు మాత్రం సెటైర్లు వేస్తున్నారు. భగత్ సింగ్‌లా కనిపిస్తున్నావని విశాల్ పొగిడితే.. ప్రకాష్ రాజ్ మాత్రం సెటైర్లు వేశాడు.

prakash raj counter to kangana ranaut,Prakash Raj
prakash raj counter to kangana ranaut,Prakash Raj

ఒక్క సినిమాతో కంగనా.. తనను తాను రాణి లక్ష్మీ బాయి అని అనుకుంటే.. దీపికా పడుకొనే -పద్మావతి, హృతిక్ రోషన్- అక్బర్, షారుఖ్‌ ఖాన్-అశోక, అజయ్ దేవ్‌గన్- భగత్ సింగ్, అమీర్ ఖాన్-మంగల్ పాండే, వివేక్ ఒబేరాయ్- మోదీ.. వీళ్లు కూడా అలా అయిపోతారా? అని సెటైర్ వేసేట్టుగా ఉండే ఓ ఫోటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ షేర్ చేసిన ఆ ఫోటో తెగ వైరల్ అవుతోంది. ఇక వీటిపై కంగనా స్పందిస్తుందో లేదో చూడాలి.

prakash raj counter to kangana ranaut,Prakash Raj
prakash raj counter to kangana ranaut,Prakash Raj