నిషా కళ్లతో క్యూట్‌ స్మైల్‌ తో కట్టిపడేసింది ప్రగ్యా జైస్వాల్‌!

టాలీవుడ్‌ సినీప్రియులకు పరిచయం అవసరం లేని పేరు ప్రగ్యా జైస్వాల్‌. వరుణ్‌ తేజ్‌ నటించిన ‘కంచె’తో ఈ ముద్దుగుమ్మకు తెలుగులో మంచి ఫాలోయింగ్‌ ఏర్పడిరది. ఈ సినిమాలో తన నటనకు ప్రశంసలు అందుకున్నప్పటికీ ఆఫర్స్‌ మాత్రం రాలేదు. దీంతో తెలుగులో ఈ బ్యూటీ గ్రాఫ్‌ కూడా పడిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లు సైలెంట్‌ అయిన ప్రగ్యా.. నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ తో మరోసారి తెరపై సందడి చేసింది.

డైరెక్టర్‌ బోయపాటి శ్రీను, బాలయ్య కాంబోలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌ అయ్యింది. అటు ప్రగ్యాకు మంచి ఫాలోయింగ్‌ ఏర్పడింది. ఈ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ చేయలేదు ప్రగ్యా. కానీ నిత్యం సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటూ లేటేస్ట్‌ ఫోటోస్‌ షేర్‌ చేస్తుంది. పట్టు చీరలు సంప్రదాయం ఉట్టిపడేలా కనిపిస్తూనే.. గ్లామర్‌ ఫోజులతో నెట్టింట రచ్చ చేస్తుంది. తాజాగా రెడ్‌ షార్ట్‌ అనార్కలి సెట్‌ లో ప్రగ్యా షేర్‌ చేసిన ఫోటోస్‌ ఇప్పుడు నెట్టింట వైరలవుతుండగా.. అందం.. మరింత అద్భుతం అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

రిధి మెహ్రా డిజైన్‌ చేసిన రెడ్‌ షార్ట్‌ అనార్కలి షరారా సెట్‌ లో మంత్రముగ్దులను చేస్తోంది. ఎరుపు, సిల్వర్‌ దారాలతో కూడిన ఎంబ్రాయిడరీ.. జార్జెట్‌ ఫుల్‌ స్లీవ్స్‌ ఉన్నాయి. డైమండ్‌ స్టేట్మెంట్‌ చెవి పోగులు, రింగ్స్‌ స్టాక్‌ జత చేసింది. నిషా కళ్లతో క్యూట్‌ స్మైల్‌ తో కట్టిపడేసింది ప్రగ్యా జైస్వాల్‌. నాకు ఇష్టమైన కలర్‌ రెడ్‌ అంటూ రాసుకొచ్చింది ప్రగ్యా.

ఇలాంటి స్టైలీష్‌ అండ్‌ బ్యూటీఫుల్‌ లుక్స్‌ లో ప్రగ్యా కనిపించడం మొదటిసారి కాదు.. ఇటీవల శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్బంగా నటి పసుపు లెహంగా సెట్‌ లో రాయల్టీ లుక్‌ లో కనిపించింది. మిర్రర్‌ వర్క్‌, స్ట్రింగ్‌ బ్లౌజ్‌.. పసుపు, గులాబీ రంగుల ప్రింటెడ్‌ లెహంగాతో జత చేసింది. రంగు రంగుల సిల్వర్‌ నెక్లెస్‌ జత చేసింది.

ఇదిలా ఉంటే.. ప్రగ్యా జైస్వాల్‌ సినిమాల్లోకి రాకముందే మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించింది. ఆమె 2015 తెలుగు హిస్టారికల్‌ డ్రామా ‘కంచె’తో తొలిసారిగా నటించింది. ఈ చిత్రానికి ఉత్తమ మహిళా అరంగేట్రం ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును కూడా అందుకుంది. ప్రగ్యా చివరిసారిగా 2022లో విడుదలైన తెలుగు యాక్షన్‌ డ్రామా ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ చిత్రంలో కనిపించింది.