“యాత్ర 2” కోసం ప్రభాస్ వరల్డ్ ప్రాజెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్.? 

రానున్న రోజుల్లో టాలీవుడ్ నుంచి రానున్న బయోపిక్ చిత్రాల్లో అయితే అవైటెడ్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ చిత్రం “యాత్ర 2” కూడా ఒకటి. అయితే పొలిటికల్ గా మైలేజ్ కోసమే గతంలో కూడా సరిగ్గా ఎన్నికల ముందే ప్లాన్ చేసిన యాత్ర 1 మంచి సక్సెస్ కాగా మళ్ళీ పార్ట్ 2 ని అయితే ఇప్పుడు మేకర్స్ లైం లైట్ లోకి తీసుకొచ్చారు.

దీనితో ఈ పార్ట్ 2 ని మరింత గ్రాండ్ గా ప్లాన్ చేస్తుండగా ఈసారి వై ఎస్ తో పాటుగా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రలు కూడా ఈ చిత్రంలో ఉండబోతున్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా ఇంకా షూటింగ్ స్టార్ట్ కావాల్సి ఉండగా సినిమా పరంగా మేకర్స్ ఎక్కడా తగ్గకుండా ప్లానింగ్ లు చేస్తున్నారు.

అలా ఇపుడు ఈ చిత్రానికి ఏకంగా పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ ని రంగంలోకి దింపినట్టుగా తెలుస్తుంది. అతడే ఇప్పుడు పలు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు సహా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న వరల్డ్ లెవెల్ చిత్రం “ప్రాజెక్ట్ కే” కి కూడా వర్క్ చేస్తున్న సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ ని తీసుకున్నట్టుగా దర్శకుడు చెప్పాడు.

మరి దీంతో ఈ సినిమాని గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని చెప్పాలి. కాగా ఈ సినిమాపై బిగ్ అప్డేట్ ని అయితే ఈ జూలై 8న వై ఎస్ జయంతి సందర్భంగా రివీల్ చేస్తున్నట్టుగా మహి తెలిపాడు. మరి సంతోష్ నారాయణన్ రీసెంట్ గా “దసరా” చిత్రం చేయగా ఇపుడు వెంకీ మామ పాన్ ఇండియా చిత్రానికి అలాగే తమిళ్ లో కబాలి, కాలా, సార్పట్ట లాంటి ఎన్నెన్నో చిత్రాలకు యూనిక్ సంగీతం అందించాడు.