ప్రభాస్ నటిస్తున్న హారర్ కామెడీ చిత్రం ‘ది రాజా సాబ్’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తొలిసారి ఈ జానర్‌లో కనిపించబోతుండటం విశేషం. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా యూనిక్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నట్లు సమాచారం. ఇదివరకు వచ్చిన మాస్ కామెడీ చిత్రాల తరహాలోనే ఈ చిత్రంలో కామెడీకి బలమైన ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ముఖ్యంగా ఈ ముగ్గురు కథానాయికలతో ప్రభాస్ చేసిన స్పెషల్ మాస్ సాంగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఇంకా, సినిమాలో హారర్ ఎలిమెంట్స్‌తో పాటు కామెడీ ట్రాక్ చాలా కొత్తగా ఉంటుందట. దాంతో, ఈ సినిమా ప్రభాస్ అభిమానులనే కాకుండా కుటుంబ ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకునేలా రూపొందించారని చిత్రయూనిట్ అంటోంది.
అయితే, షూటింగ్ ఇంకా పూర్తికాకపోవడం వల్ల విడుదల తేదీపై సందిగ్ధత నెలకొంది. టీమ్ ముందుగా ఏప్రిల్ 10న సినిమా విడుదల చేయాలని భావించినప్పటికీ, ప్రస్తుతానికి 80 రోజుల షూటింగ్ ఇంకా మిగిలి ఉందని తెలుస్తోంది. దీనికి తోడు విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ వంటి కీలక పనులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. దాంతో, ఈ చిత్రాన్ని అనుకున్న సమయానికి విడుదల చేయడం కష్టంగా కనిపిస్తోంది.
మేకర్స్ ఇప్పుడు ఈ సినిమా గ్రాండ్ గా విడుదల చేయడానికి వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి జూన్‌లో విడుదల చేయాలని యోచన చేస్తున్నట్లు సమాచారం. అభిమానులు మాత్రం ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో మరో పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నారు. ‘ది రాజా సాబ్’ టీమ్ అన్ని అంచనాలను మించిన సినిమా అందించేందుకు పనిచేస్తోంది. విడుదల ఆలస్యం అయినా, ఇది ప్రభాస్ కెరీర్‌లో మరో బిగ్ హిట్ గా నిలుస్తుందని భావిస్తున్నారు. మరి ఈ చిత్రానికి సంబంధించిన కొత్త అప్‌డేట్స్ ఎప్పుడు వస్తాయో చూడాలి.