మరోసారి గోపిచంద్ కోసం ప్రభాస్.. అలా సెట్ చేశాడు

ఒక సినిమా సెట్స్ పైకి వచ్చింది అంటే దాని వెనుక ఎవరో ఒకరి నిర్ణయం బలంగా ఉంటుంది. ఇక హీరోలు కొన్ని క్లిష్టమయిన సమయాల్లో ఎలాంటి సినిమాలు చేయాలి అని ఆలోచనలతో సతమతమవుతుంటారు. ఆ సమయంలో వారికి వచ్చే సూచనలు చాలానే ఉంటాయి. ఇక గత కొంతకాలంగా గోపిచంద్ కు కూడా అలాంటి సూచనలు గట్టిగానే వస్తున్నాయట.

ప్రస్తుతం గోపిచంద్ సీటిమార్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ యాక్షన్ హీరో గత సినిమాలు చాలా వరకు బాక్సాఫీస్ వద్ద దారుణమైన రిజల్ట్ ను అందుకున్నాయి. ముఖ్యంగా సెట్స్ పైకి వచ్చిన సినిమాలు కూడా సడన్ గా క్యాన్సిల్ అవుతున్నాయి. అయితే ఇటీవల ప్రభాస్ సహకారంతో గోపిచంద్ మంచి అవకాశం అందుకున్నాడట. వీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని అందరికి తెలిసిందే.

మారుతి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మించబోతున్న కొత్త సినిమాలో గోపిచంద్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఎనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. మారుతితో ప్రత్యేకంగా మాట్లాడి గోపీచంద్ తో పక్కా కమర్షియల్ అనే సినిమా చేయడానికి ఒప్పించాడట ప్రభాస్. గతంలో జిల్ సినిమా తెరకెక్కడానికి కూడా ప్రభాసే ముఖ్య కారణం. మరి ఇప్పుడు సెట్ చేసిన ఈ కాంబో ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.