సినిమా వ్యాపారం, పారితోషికం విషయంలో టాలీవుడ్‌లో ప్రభస్ నంబర్ వన్ నటుడు. ఇప్పటివరకు ప్రభాస్ దరిదాపుల్లోకి వచ్చే హీరో మరెవ్వరు లేరంటే ఆశ్చర్యం లేదు. ప్రభాస్ ప్రస్తుతం ప్రతి చిత్రానికి 75 నుంచి 80 కోట్ల వేతనం తీసుకుంటున్నారు.
కొన్ని ప్రాజెక్టులలో, అతను లాభాలలో 10% వాటాను కూడా తీసుకుంటాడట. ఏదేమైనా సగటున ప్రభాస్ ఒక సినిమా ఒప్పుకుంటే దాదాపు 75 కోట్లు వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడట.
సినిమా వ్యాపార విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ప్రభాస్ ప్రస్తుతం ఒప్పుకున్న అదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమా మరియు రాధేశ్యామ్ చిత్రాలకు దాదాపు 300 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ ముట్టిందట.
ప్రభాస్ మరో సినిమాను కూడా ప్రకటించబోతున్నాడు. హాబ్బలే ఫిల్మ్స్ బ్యానర్ కోసం KFG సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి ప్రభాస్ సినిమా చేయనున్నారు. ఈ చిత్రం పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ కానుంది. ఈ ప్రాజెక్టు కోసం రూ .100 కోట్ల వేతనం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.
ప్రభాస్ కృష్ణం రాజు వారసుడుగా సినిమా పరిశ్రమ ప్రేవేశం చేసారు. అయితే తనలో ఏమాత్రం గర్వం లేకుండా అందరితో కలిసి మెలసి ఉండటంతో తనతో పని చేసిన దర్శుకులంతా ప్రభాస్ కి మంచి హిట్ సినిమాలు రావాలని గట్టిగా కృషి చేసేవారు. ఇదే ప్రభాస్ ఇంత పెద్ద స్టార్ అవ్వడానికి దోహదపడింది.
శ్రీదేవి, జయప్రద లాంటి తెలుగు సంతతి కి చెందిన హీరోయిన్లు బాలీవుడ్ టాప్ స్టార్లుగా రాణించారు కానీ హీరోలుగా ఎవ్వరు ఆ స్థాయి ని అందుకోలేకపోయారు. అయితే ఇప్పుడు అది సాధించడానికి ప్రభాస్ కూత వేటు దూరంలో వున్నారు. ఇప్పుడు తాను నటిస్తున్న మూడు సినిమాల్లో ఏ రెండు సినిమాలు విజయం సాధించినా వచ్చే పదేళ్లు భారత దేశం లో ప్రభాస్ ని కొట్టే స్టార్ వుండడు అంటే ఆశ్చర్యం లేదు.
అల్ ది బెస్ట్ ప్రభాస్ !!