Krishnam Raju: ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజుకి సర్జరీ… కాలి వేలిని తొలగించిన వైద్యులు!

Krishnam Raju: సీనియర్ నటుడిగా రెబల్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు కృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటిస్తూ ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ చిత్రంలో కూడా కృష్ణంరాజు కీలక పాత్రలో నటించారు.ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం నటుడు కృష్ణం రాజు ఇంట్లో కాలు జారి కింద పడడంతో ఆయనకు చిన్నపాటి సర్జరీ నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి.

ఇదిలా ఉండగా తాజాగా మరోసారి కృష్ణంరాజు ఇంట్లో జారి పడటంతో ఆయన కాలికి దెబ్బ తగిలిందని ఈ క్రమంలోనే వైద్యులు చిన్నపాటి సర్జరీ నిర్వహించి కాలి వేలిని కూడా తొలగించినట్లు తెలుస్తోంది. ఇలా కాలివేళ్ళను తొలగించారనే విషయం తెలియడంతో అభిమానులు కాస్త కంగారు పడుతున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని కృష్ణంరాజు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ఇలా వయసు పైబడుతున్న కొద్దీ కృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుందనీ తెలుస్తోంది వయసు పైబడుతున్న కొద్ది కృష్ణంరాజు పలు చిత్రాల ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాలో కూడా పరమహంస అనే ఒక సాధువు పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ క్రమంలోనే పెద్దఎత్తున చిత్రబృందం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.