ప్రబాస్ సరసన అనుష్క.! కండిషన్స్ అప్లై.!

ప్రబాస్ – అనుష్క.. ఈ కాంబోకి వున్న కిక్కే వేరప్పా.! ఆన్ స్ర్కీనే కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా ఈ కాంబో వార్తల్లో వుందంటే చాలు అదో రకం కిక్కు. ‘బాహుబలి’ తర్వాత ఈ కాంబినేషన్ మళ్లీ పట్టాలెక్కింది లేదు.

అఫ్‌కోర్స్.! ఆ తర్వాత అనుష్క కూడా సినిమాలకు దూరంగా వుండడం అందుకు ఓ కారణం. అయితే, ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో అనుష్క మళ్లీ సినిమాల్లోకి వచ్చింది.

రీ ఎంట్రీ సినిమాతో మంచి హిట్టు కొట్టింది. సో, అనుష్క మళ్లీ వార్తల్లో హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. అందులో భాగంగానే పలువురు సీనియర్ హీరోల సరసన అనుష్క.. అంటూ వార్తలు దండిగా వినిపిస్తున్నాయ్.

ఆ నేపథ్యంలోనే ప్రబాస్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ప్రబాస్ – మారుతి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

అయితే, ఈ సినిమాలో అనుష్క కోసం ప్రత్యేకంగా ఓ చిన్న పాత్రను క్రియేట్ చేశాడట డైరెక్టర్ మారుతి. ఆ పాత్ర కోసం అనుష్కని సంప్రదించాడట. అనుష్క నుంచి ఇంకా ఎలాంటి రెస్పాన్స్ రాలేదనీ తెలుస్తోంది. అయితే, ప్రబాస్‌కీ, అనుష్కకీ మధ్య వున్న స్నేహ బంధం అందరికీ తెలిసిందే. ప్రబాస్ అడిగితే అనుష్క కాదనే ప్రశక్తే వుండదు.

అసలింతకీ ఈ ప్రచారంలో నిజమెంతో కానీ, ఒకవేళ అదే జరిగితే, అది ఖచ్చితంగా సినిమాకి మంచి మైలేజ్ అవుతుంది. అందులో నో డౌట్.!