బిగ్ న్యూస్ : RRR స్టార్స్ తో సినిమాపై ఓపెన్ అయ్యిన ప్రభాస్!

ప్రస్తుతం ఇండియన్ సినిమా నుంచి వెళ్లిన ఓ చిత్రం కోసమే హాలీవుడ్ మీడియా ఎంతగానో మాట్లాడుతుంది ఇటు వెబ్ మీడియా సహా అక్కడ మూవీ మీడియాలో కూడా వినిపిస్తున్న ఒకే ఒక్క సినిమా పేరు “కల్కి”. పాన్ ఇండియా హీరో ప్రభాస్ దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో..

అమితాబ్ బచ్చన్, ఉలగనయగన్ కమల్ హాసన్ దీపికా, దిశా పటాని లాంటి భారీ తారాగణంతో తెరకెక్కించిన ఈ సినిమా నుంచి గ్లింప్స్ ని మేకర్స్ ఇపుడు హాలీవుడ్ ఈవెంట్ కామిక్ కాన్ లో విడుదల చేయగా ఈ విడుదల ఈవెంట్ లో ప్రభాస్ హాలీవుడ్ మీడియాతో ముచ్చటించాడు.

కాగా అక్కడ మాట్లాడుతూ RRR స్టార్స్ అయ్యిన హీరోలు రామ్ చరణ్ అలాగే ఎన్టీఆర్ లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది. RRR లో నటించిన చరణ్, ఎన్టీఆర్ లు అలాగే దర్శకుడు రాజమౌళి కూడా నాకు మంచి ఫ్రెండ్స్ అని అతి త్వరలోనే వారితో కలిసి సినిమా చేస్తాను అన్నట్టుగా ప్రభాస్ చెప్పడం ఇపుడు ఓ బిగ్ థింగ్ గా మారిపోయింది.

దీనితో హాలీవుడ్ మీడియా నుంచి ఈ క్లిప్ ఇప్పుడు వైరల్ గా మారింది. మరి ఇది RRR 2 లో ఉంటుందా లేక మరో సినిమానా అనేది మాత్రం చూడాలి. మొత్తానికి అయితే ఈ సెన్సేషనల్ కాంబినేషన్ కొలాబరేషన్ అనేది ఊహించని అంశం అని చెప్పి తీరాలి. మరి భవిష్యత్తులో ఏమవుతుందో కూడా చూడాలి.