Prabhas : మొన్న బాహుబలి, ఇపుడు ఆదిపురుష్ కూడా నా…! మళ్ళీ సీక్వల్ తీస్తున్న డార్లింగ్…!

Prabhas : ప్రభాస్ కెరీర్ లో అతి పెద్ద హిట్ సినిమా రాజమౌళి తీసిన బాహుబలి. ఇక ఆ తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అందుకు తగ్గట్టుగానే సినిమాలను ప్లాన్ చేసుకున్నాడు. భారీ బడ్జెట్ తో సినిమాలు తీశారు. పాన్ ఇండియా లెవెల్ లో విడుదలచేసిన సాహో ఆ తరువాత భారీ బడ్జెట్ గ్రాఫిక్స్ తో వచ్చిన రాధే శ్యామ్ బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచాయి.

ప్రస్తుతం ప్రభాస్ ‘ఆదిపురుష్’, ‘సలార్’ ‘ప్రాజెక్టు కె’ వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. అటు తర్వాత ‘స్పిరిట్’ కూడా చేస్తున్నాడు. మారుతీతో సినిమా ఉందంటున్నారు కానీ ఇంకా అనౌన్స్మెంట్ రాలేదు. అయితే వీటిలో ఏది కూడా ప్రభాస్ అభిమానులను ఫుల్ గా సంతృప్తి పరిచే సినిమాలు కావు. పైగా ఇవి భారీ బడ్జెట్ సినిమాలు… బిజినెస్ ఎక్కువ చేస్తాయి కానీ జనాలను థియేటర్లకు రప్పించే సినిమాలు అవుతాయా అంటే కచ్చితంగా అవునని చెప్పలేము.

ఇక ఆది పురుష్ 2023 సంక్రాంతికి విడుదల అంటున్నారు కాబట్టి ఓపెనింగ్స్ అయితే వస్తాయి. పండుగ సెలవులు వరకు బాగానే రాబడుతుంది. ఆ తర్వాత అయితే కష్టం. ఇదిలా ఉంటే… ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రూపొందనుందనేది తాజా సమాచారం. దర్శకుడు ఓం రౌత్ ప్రభాస్ కు కథ వినిపించడం.. ప్రభాస్ కు నచ్చడం కూడా జరిగిపోయిందట. ఇది కూడా సెట్స్ పైకి వెళ్తే.. ఇప్పట్లో ప్రభాస్ నుండి అభిమానులు ఆశించే సినిమా రావడం కష్టమే..!