ప్చ్..ప్రభాస్ మేనియాలో కొట్టుకుపోయిన మెగాస్టార్ సినిమా.!

ఇప్పుడు మన తెలుగు చలన చిత్ర పరిశ్రమ నిజంగా మరో స్థాయిలో కళకళలాడుతుంది అని చెప్పాలి. ఓ పక్క భారీ బాక్సాఫీస్ సక్సెస్ లు మరో పక్క తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్న చిత్రాలు వరుసగా వస్తున్నాయి. దీనితో మేజర్ గా చాలా మంది ఆడియెన్స్ ఈ కంటెంట్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండగా..

మధ్యలో రీమేక్స్ అంటూ వస్తున్నా పలు చిత్రాలకి కిక్కిరుమనే బజ్ కూడా లేకపోతోంది. అయితే ఇపుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం “భోళా శంకర్” నుంచి ఈరోజు ఓ సాంగ్ ని రిలీజ్ చేశారనే విషయం మీకు తెలుసా? అసలు ఈ సాంగ్ ఎప్పుడు ఎలా రిలీజ్ అయ్యిందో కూడా ఎవరికీ తెలీదు.

ఓ పక్క సోషల్ మీడియా అంతా ప్రభాస్ చేసిన సెన్సేషనల్ ప్రాజెక్ట్ “కల్కి” కోసమే మాట్లాడుతుండగా అసలు ఈ సినిమా మేనియా లో అయితే చిరు భోళా శంకర్ సినిమా పాట వచ్చినట్టే తెలియలేకుండా పోయింది. దీనితో అసలు ఆడియెన్స్ ఎలాంటి చిత్రాలకు ఎలాంటి కంటెంట్ కి మొగ్గు చూపిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

ఇక ఇప్పటికే భోళా శంకర్ టీజర్ తర్వాత దానికి వచ్చిన హైప్ ని సాంగ్స్ బాగా తగ్గించేసాయి. దీనితో అసలు ఈ సినిమాపై ఉన్న అంచనాలు కూడా తగ్గిపోతున్నాయి. ఇక ఇదే కొనసాగితే “వాల్తేరు వీరయ్య” లో సగం వసూళ్లు అయినా వస్తాయో లేదో చూడాలి.