ప్రభాస్ ‘కల్కి’ విడుదలపై డౌట్స్ పెరుగుతున్నాయ్.!

ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘కల్కి’ సినిమా రానున్న మే నెలలో విడుదల కావాల్సి వున్న సంగతి తెలిసిందే. ‘సలార్ సీజ్ ఫైర్’ తర్వాత ప్రభాస్ నుంచి రానున్న సినిమా ఇదే.

అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘కల్కి’ సినిమా తెరకెక్కింది. సినిమా షూటింగ్ పూర్తయిపోయినా, గ్రాఫిక్స్ తదితర వ్యవహారాల చుట్టూ సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సినిమాకి వీఎఫ్ఎక్స్ అత్యంత కీలకం.

వీఎఫ్ఎక్స్ విషయమై ప్రభాస్ గత చిత్రాలు చాలా చాలా విమర్శలు ఎదుర్కొన్నాయి. ‘బాహుబలి’ అద్భుతం అయితే, ‘ఆదిపురుష్’ అత్యంత దారుణం.! ఈ నేపథ్యంలో ‘కల్కి’ మీద వీఎఫ్ఎక్స్ విషయమై చాలా ఒత్తిడి వుంటుంది.

మేకర్స్ ఈ విషయాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. శరవేగంగా వీఎఫ్ఎక్స్ చేయిస్తున్నారు కూడా. అనుకున్న సమయానికి వీఎఫ్ఎక్స్ వర్క్ పూర్తవకపోతేనో.? ఇప్పుడు ఇదే టెన్షన్ చిత్ర యూనిట్‌ని వెంటాడుతోంది.

మే నెలలో విడుదలవ్వాల్సిన ‘కల్కి’ వాయిదా పడటమంటూ జరిగితే, కేవలం ఆ వీఎఫ్ఎక్స్ వల్లనే అవుతుంది. అది తప్పేలా లేదు కూడా. అందుకే, విడుదల వాయిదా వేద్దామా.? అని మల్లగుల్లాలు పడుతున్నారట మేకర్స్. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

ప్రభాస్ సరసన దిశా పటానీ, దీపికా పడుకొనే ఈ సినిమాలో ఫిమేల్ లీడ్‌గా నటిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ ‘కల్కి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.