గ్లోబల్‌ స్టార్‌ హీరో ప్రభాస్‌ ‘కల్కి’ విడుదలలో మరింత ఆలస్యం?

గ్లోబల్‌ స్టార్‌ హీరో ప్రభాస్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తోన్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ . నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సైన్స్‌ ఫిక్షన్‌ జోనర్‌లో తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ముందుగా ప్రకటించిన ప్రకారం మే 9న విడుదల చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా ఈ మూవీ మరో తేదీన రాబోతుందంటూ వార్తలు ఇప్పటికే నెట్టింట హల్‌ చల్‌ చేస్తున్నాయి. తాజాగా ‘కల్కి 2898 ఏడీ’ రిలీజ్‌ డేట్‌పై కొత్త అప్‌డేట్‌ బయటకు వచ్చింది. చిత్రీకరణ, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల ఆలస్య కారణంగా ఈ చిత్రాన్ని జులై 12న విడుదల చేయబోతున్నారంటూ వార్త చక్కర్లు కొడుతోంది. మరి ఈ విడుదల తేదీపై మేకర్స్‌ నుంచి అధికారిక అప్‌డేట్‌ వస్తే క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. వై

జయంతీ మూవీస్‌ బ్యానర్‌పై సీ అశ్వనీదత్‌ నిర్మిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’లో బాలీవుడ్‌ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ ఫీ మేల్‌ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. లెజెండరీ యాక్టర్లు అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, రాజేందప్రసాద్‌, పశుపతి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

మేకర్స్‌ ఇప్పటికే లాంఛ్‌ చేసిన ‘కల్కి 2898 ఏడీ’ టైటిల్‌, గ్లింప్స్‌ వీడియో, టీజర్‌ మిలియన్ల సంఖ్యలో వ్యూస్‌ రాబడుతున్నాయి. మేకర్స్‌ చాలా రోజుల క్రితం విడుదల చేసిన ‘కల్కి 2898 ఏడీ’ రైడర్స్‌ కాస్ట్యూమ్స్‌ మేకింగ్‌, అసెంబ్లింగ్‌ వీడియో సినిమాపై అంచనాలు పెంచేస్తూ.. సూపర్‌ బజ్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. నాగ్‌ అశ్విన్‌ టీం కొన్ని రోజుల క్రితం ఇటలీలోని సర్దినియా ఐలాండ్‌లో ప్రభాస్‌, దిశాపటానీపై వచ్చే పాటను చిత్రీకరించారని తెలిసిందే. లొకేషన్‌లో ప్రభాస్‌, దిశాపటానీ స్టైలిష్‌ లుక్‌లో ఉన్న స్టిల్‌ సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. ఈ సాంగ్‌ లో ప్రభాస్‌ సూపర్‌ స్టైలిష్‌గా కనిపించబోతున్నట్టు నెట్టింట రిలీజ్‌ చేసిన స్టిల్స్ క్లారిటీ ఇచ్చేస్తున్నాయి.