ప్రభాస్ ఫ్యాన్స్ కు నాన్ స్టాప్ పూనకాలు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అన్ని కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలే కావడం విశేషం. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సలార్ మూవీ షూటింగ్ దశలో ఉంది. గ్యాప్ లేకుండా ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు. మూవీకి సంబందించిన యాక్షన్ సీక్వెన్స్ ప్రస్తుతం తెరకెక్కించే పనిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే దీంతో పాటు మారుతి దర్శకత్వంలో చేస్తున్న రాజా డీలాక్స్ కూడా షూటింగ్ దశలోనే ఉంది.

దీంతో పాటు ఆదిపురుష్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ మూవీ మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కె మూవీ అయితే పాన్ వరల్డ్ రేంజ్ లో ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాల ద్వారా ప్రభాస్ మీద వేల కోట్ల `వ్యాపారం ప్రస్తుతం జరుగుతుంది. ఇక ఈ సినిమాలు రిలీజ్ అయ్యే సమయంలో వేరొక హీరోల సినిమాలు ఏవి వచ్చిన ఓపెనింగ్స్ తెచ్చుకోవడం కష్టం అనే మాట వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే జూన్ నెల నుంచి ప్రభాస్ సినిమాలు ప్రతి మూడు నెలల గ్యాప్ లో ఒక మూవీ రిలీజ్ కాబోతుంది. జూన్ 16న ఆదిపురుష్ పాన్ ఇండియా లెవల్ లో గ్రాండ్ గా రిలీజ్ కి రెడీ అవుతుంది. దీని తర్వాత సెప్టెంబర్ 28న సలార్ మూవీ రిలీజ్ కాబోతుంది. దీని తర్వాత జనవరి 12, 2024న ప్రాజెక్ట్ కె రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

మొత్తం ఏడు నెలల గ్యాప్ లోనే బ్యాక్ టూ బ్యాక్ ప్రభాస్ తన సినిమాలని ప్రేక్షకులకి అందించడానికి రెడీ అవుతూ ఉండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ మూడు చిత్రాలపై భారీ అంచనాలు ఉన్నాయి. కచ్చితంగా మూడు ప్రాజెక్ట్స్ సూపర్ సక్సెస్ అందుకుంటాయి అని అందరూ భావిస్తున్నారు.