Shivaji Raja: ప్రభాస్‌ది ఎంత గొప్ప మనసంటే.. అడగ్గానే ఎంతో డబ్బు ఇచ్చారు… శివాజీ రాజా!

Shivaji Raja: ఇన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే యాక్టర్లకు ప్రత్యేకంగా ఒక ఆఫీసంటూ లేదని, అది తనకు ఎప్పటినుంచో ఉన్న డ్రీమ్ అని, అది ఇప్పటికీ ఫుల్‌ఫిల్ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రముఖ సినీ నటుడు శివాజీ రాజా. దీంట్లో మన హీరోలది ఎవ్వరిదీ తప్పు లేదన్న ఆయన, అడిగేవారు లేకపోవడం వల్లే అది జరగడం లేదని ఆయన చెప్పారు. తాను కూడా ముందు ఇంతమందికి ఇన్ని కోట్లు ఉన్నాయి కదా, ఇంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.. ఆఫీస్ కట్టలేరా అని.. కానీ ఇక్కడ ఎవరి సమస్యలు వారివేనని ఆయన చెప్పుకొచ్చారు. తాను వెళ్లి అడిగే వరకూ ఈ విషయంపై ఎవరూ బయటకు రాలేదని ఆయన అన్నారు. చిరంజీవి గారిని కూడా అడిగితేనే కదా ఆయన కూడా బయటికొచ్చింది అని ఆయన చెప్పారు.

ఆ తర్వాత మహేశ్ బాబును కూడా అడిగానని, మీరెలా చెప్తే అలా చేద్దా సర్ అని ఆయన అన్నారని శివాజీ రాజా అన్నారు. అంత కన్నా తృప్తేముంటుంది అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ప్రభాస్‌ గారి దగ్గరికి కూడా వెళ్లానన్న శివాజీ రాజా, సర్ ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల మీకెంత వస్తుంది అని అడిగారని ఆయన చెప్పారు. సర్ బిజీగా ఉన్నాను.. ఆ అమౌంట్ నేను ఇచ్చేయనా అని ప్రభాస్ అన్నట్టు ఆయన తెలిపారు. ఇలా అనే వాళ్లు ఎంత మంది ఉంటారు అని శివాజీ రాజా అన్నారు.

ఈ ముగ్గురు పెద్ద హీరోల దగ్గరికి వెళ్తేనే ఇంత అమౌంట్ వచ్చింది కదా.. ఇంకా జూ. ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి ఎంతో మంది మనసున్న పెద్ద స్టార్స్ చాలా మంది ఉన్నారని, నాగార్జున, వెంకటేశ్‌ గారిని కూడా కలిశానని అందరూ కూడా ఈ విషయంపై పాజిటివ్‌గానే స్పందించారని ఆయన చెప్పారు. ఇక్కడ ఎవరూ డబ్బు ఇవ్వరు అని లేదు, కానీ అసలు అడిగే వ్యక్తి లేక ఇన్ని రోజులూ అలాగే ఉండిపోయిందని ఆయన స్పష్టం చేశారు. అంతేగానీ మన హీరోలు ఇవ్వరు అని అనుకోవడం చాలా అబద్దం అని ఆయన వివరించారు.