Prabhas: టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బాగా బిజీగా ఉన్నాడు. ఇటీవలే లవ్ అండ్ రొమాంటిక్ నేపథ్యంలో తెరకెక్కిన ‘రాధేశ్యామ్’ సినిమాతో క్లాస్ పీపుల్స్ ను బాగా ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ‘సలార్’ సినిమా షూటింగ్ లో అడుగుపెట్టాడు. కానీ తాజాగా ప్రభాస్ కు అనారోగ్య సమస్య ఏర్పడింది.
ప్రస్తుతం సలార్ సినిమాలో బిజీగా ఉన్నా ప్రభాస్.. ఈ సినిమా షూటింగ్ లో గాయపడ్డాడు. దీంతో ఆయన స్పెయిన్ లోని బార్సిలోనాలో చికిత్స తీసుకుంటున్నాడు. ఇక వైద్యులు ఆయనకు చిన్నపాటి ఆపరేషన్ కూడా చేయాలని అన్నారట. ఇక ప్రభాస్ కు కొన్ని రోజుల వరకు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారని తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో ప్రభాస్ అభిమానులు ఆందోళనలో ఉన్నారు.