ఆ సినిమా విషయంలో అనుష్కకు వార్నింగ్ ఇచ్చిన ప్రభాస్… ఆయన వినని దేవసేన?

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన అనుష్క శెట్టి గురించి తెలియని వారంటూ ఉండరు. అరుంధతి సినిమాతో అందరినీ తన వైపు తిప్పుకున్న అనుష్క టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రిలలో స్టార్ హీరోయిన్ గుర్తింపు పొందింది. ఇక ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమాలలో నటించి ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. ఇక అనుష్కకి ఇండస్ట్రీలో ఉన్న స్నేహితులు అనగానే మొదటగా గుర్తొచ్చే పేరు ప్రభాస్. అనుష్క ప్రభాస్ ఎన్నో సినిమాలలో కలిసిన నటించారు. వీరిద్దరి జోడి ఆన్ స్క్రీన్ మీద మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్ చూడముచ్చటగా ఉంటుంది. అంతే కాకుండా ప్రభాస్ స్నేహం కోసం అనుష్క సినిమాలు కూడా వదిలేయటానికి సిద్ధంగా ఉందని ఒక షోలో వెల్లడించింది.

అంతేకాకుండా వీరిద్దరూ ఒకరి పట్ల ఒకరు చూపించే అభిమానం, కేరింగ్ చూసి భవిష్యత్తులో వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారని వార్తలు వినిపించాయి. అయితే వారిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ తప్ప మరేమీ లేదని ఎంత చెప్పినా కూడా అభిమానుల మాత్రం వీరిద్దరూ లవర్స్ గా ఉంటేనే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. వీరిద్దరి పెళ్లి కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల అనుష్క గురించి ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. అనుష్క ప్రభాస్ మధ్య మంచి స్నేహం ఉండటంవల్ల తన సినిమాల విషయంలో ప్రభాస్ సలహా తీసుకుంటుంది. అలాగే క్రిష్ దర్శకత్వం వహించిన వేదం సినిమాలో అనుష్క ఒక వేశ్యపాత్రలో నటించింది.

అయితే ఆ సినిమా చేయద్దని ప్రభాస్ సూచించిన కూడా అనుష్క మాత్రం కథ నచ్చి ఆ సినిమాలో నటించింది. తీరా ఆ సినిమా విడుదలై మంచి హిట్ అవడంతో పాటు అనుష్క నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి. ఒక స్టార్ హీరోయిన్ వేశ్య పాత్రలో నటించడం వల్ల ఇమేజ్ దెబ్బతింటుందని భావించి అనుష్కని ఈ సినిమా రిజెక్ట్ చేయమని చెప్పాడు. కానీ సినిమా మంచి హిట్ అవ్వటంతో ప్రభాస్ కూడా ఆశ్చర్యపోయాడు. సినిమాలో అనుష్క వేశ్య పాత్రలో నటించిన కూడా ఆమెని అందరూ స్టార్ హీరోయిన్ గా చూశారే కానీ ఆ కోణంలో ఎవరు చూడలేరు. అంతేకాకుండా ఆ సినిమా తర్వాత అనుష్కకు వరుసగా ఆఫర్లు కూడా వచ్చాయి.