రాధేశ్యామ్ సెట్ లో ప్రభాస్.. ఏం చేస్తున్నాడో చూడండి

Prabhas from the sets of radheshyam movie

ప్రస్తుతం ప్రభాస్ ఇటలీలో ఉన్నారు. తన తదుపరి సినిమా రాధేశ్యామ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. సాహో తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ప్రభాస్ చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాకు జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్టర్. కృష్ణంరాజు సమర్పణలో ఈ సినిమా రాబోతోంది. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై సినిమాను నిర్మిస్తున్నారు.

Prabhas from the sets of radheshyam movie
Prabhas from the sets of radheshyam movie

ఇక.. ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కోసం ప్రభాస్, పూజా హెగ్డ్ తో పాటు మరికొందరు నటీ నటులు, సాంకేతిక నిపుణులు ఇటలీ వెళ్లారు. అక్కడ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది.

Prabhas from the sets of radheshyam movie
Prabhas from the sets of radheshyam movie

ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ ప్రభాస్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకోగా… ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా… అక్టోబర్ 23న రాధేశ్యామ్ మోషన్ పోస్టర్ ను మూవీ యూనిట్ విడుదల చేయనుంది. దానికి బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ అని పేరు పెట్టారు.

Prabhas from the sets of radheshyam movie
Prabhas from the sets of radheshyam movie

ఇక.. తాజాగా రాధేశ్యామ్ సెట్ లో ఉన్న ప్రభాస్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రభాస్.. చిన్న పిల్లలతో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.