ప్రభాస్ ఫ్యాన్స్ రెడీ.. ఆరోజున “సలార్” నుంచి మాసివ్ ట్రీట్?

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ వాంటెడ్ అండ్ మోస్ట్ అవైటింగ్ గా ఉన్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రాల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ హీరో ప్రభాస్ ల కలయికలో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “సలార్ సీజ్ ఫైర్” కూడా ఒకటి. మాసివ్ హైప్ ని క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాక మళ్ళీ ఎలాంటి అప్డేట్ కూడా మేకర్స్ నుంచి బయటకి రాలేదు.

కానీ కొన్ని ఆసక్తికర పుకార్లు మాత్రం ఎప్పటికపుడు వినిపిస్తూనే వస్తుండగా అలా ఇండస్ట్రీ వర్గాల నుంచి ఓ సాలిడ్ న్యూస్ ఇప్పుడు తెలుస్తుంది దీని ప్రకారం ఐతే మేకర్స్ ఈ పండుగ దీపావళి కానుకగా ఒక ఊహించని ట్రీట్ ని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. కాగా అది మొన్నటిలా వచ్చిన చాలా సింపుల్ అప్డేట్స్ లా కాకుండా నెక్స్ట్ లెవెల్ ట్రీట్ ఇచ్చే దానిలా ఉంటుంది అని సిద్ధంగా ఉండండి అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కి గట్టి ట్రీట్ అందబోతుంది అని అంటున్నారు.

మరి అదేంటి వేసి చూడాలి. ఇప్పటీకే ప్రభాస్ బర్త్ డే కే మేకర్స్ బాగా దెబ్బకొట్టారు. మరి ఈసారి దాన్ని కవర్ చేసే లెవెల్ ట్రీట్ ఏమిస్తారో చూడాల్సిందే. కాగా ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా పృథ్వీ రాజ్ సుకుమారన్ విలన్ గా నటించాడు. ఈ డిసెంబర్ 22న ఈ సినిమా అయితే ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.