జూబ్లీహిల్స్ లో 84 ఎకరాలు కొన్న ప్రభాస్.. స్పందించిన బాహుబలి నిర్మాత!

సాధారణంగా సినిమా సెలబ్రిటీల గురించి ఏవో ఒక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇలా సెలబ్రిటీల గురించి సోషల్ మీడియాలో వచ్చే వార్తలలో కేవలం 10 శాతం నిజమైతే 90% అవాస్తవాలు అవుతూ ఉంటాయి.ఇకపోతే పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ గురించి ఆయన పెళ్లి వార్తలు గురించి ఏదో ఒక న్యూస్ వైరల్ అయింది. ఇకపోతే తాజాగా ఈయన జూబ్లీహిల్స్ లో ఏకంగా 84 ఎకరాలు స్థలం కొనుగోలు చేశారని వార్తలు వస్తున్నాయి.

 

జూబ్లీహిల్స్ లో ఎకరా కోటి రూపాయలు పెట్టి ప్రభాస్ 84 ఎకరాల ఫామ్ హౌస్ కొనుగోలు చేశారంట పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టడంతో ఎంతోమంది నెటిజన్ లు ఏంటి జూబ్లీహిల్స్ లో ఎకరం కోటి రూపాయలేనా అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇలా ప్రభాస్ ఫామ్ హౌస్ కొనుగోలు చేశారనే విషయం పై తాజాగా బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు.ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ ఏంటి ఇది నిజమేనా జూబ్లీహిల్స్ లో ఎకరం కోటి రూపాయలేనా అంటూ ఆయన కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

 

అసలు జూబ్లీహిల్స్ లో భూమి విలువ ఎంత ఉందో కనీసం అదైనా తెలుసా ఇలా ఏదీ తెలుసుకోకుండా తప్పుడు వార్తలు రాసి ఆ వార్తలకు స్టార్ హీరోల పేర్లను స్టాంప్ వేస్తూ ఉంటారంటూ ఈయన మండిపడ్డారు. ఇక ఈ విషయంపై డైరెక్టర్ మారుతి స్పందిస్తూ ప్రభాస్ ఫామ్ హౌస్ కి రాదేశ్యామ్ ఇంటీరియర్ డిజైన్ వేసారంటు ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. దీంతో ప్రభాస్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయింది.