Prabhas Radheshyam: ప్రభాస్ అభిమానులు పండగ చేసుకునే అప్ డేట్.. ఈ మాత్రం కిక్ చాలు

Prabhas as VikramAditya from RadheShyam

ఇది కదా అప్ డేట్ అంటే. ఈ మాత్రం అప్ డేట్ వచ్చినా చాలు ప్రభాస్ అభిమానులకు పండగే. కిక్కే కిక్కు. ఎన్ని రోజుల నుంచి ప్రభాస్ అభిమానులు ఎదురు చూస్తున్నారు? ఎప్పుడు వస్తుందా ఆ రోజు అని. ప్రభాస్ కొత్త మూవీ రాధేశ్యామ్ కు సంబంధించిన అధికారిక అప్ డేట్ కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నామో… దానికి తగ్గట్టుగానే అసలైన అప్ డేట్ అందించింది మూవీ యూనిట్.

Prabhas as VikramAditya from RadheShyam
Prabhas as VikramAditya from RadheShyam

రాధేశ్యామ్ కు సంబందించి.. ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు.. రాధేశ్యమ్ లో ప్రభాస్ పేరును కూడా రివీల్ చేసింది మూవీ యూనిట్.

నిజానికి ప్రభాస్ పుట్టిన రోజు అక్టోబర్ 23న ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ వస్తుందని అంతా భావించారు కానీ.. రెండు రోజుల ముందే ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకునే అప్ డేట్ ఇచ్చారు.

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు.. ఈ సినిమాలో ప్రభాస్.. విక్రమాదిత్య అనే పాత్రలో ప్రేక్షకులను మెప్పించబోతున్నారు.

Prabhas as VikramAditya from RadheShyam
Prabhas as VikramAditya from RadheShyam

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరుపుకుంటోంది. రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాకు డైరెక్టర్. ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమా తెలుగుతో పాటుగా కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కనుంది. ఈ సినిమాలో జగపతిబాబు, సత్యరాజ్, జయరాం లాంటి సీనియర్లు ముఖ్య పాత్రల్లో నటించనున్నారు.