ప్రభాస్ మరో బిగ్ కాంబో.. నిజమెంత?

ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత సరైన సక్సెస్ అందుకోలేక కాస్త సతమతమవుతున్నాడు. అయినప్పటికీ కూడా అతని ప్రతి సినిమాకు భారీ అంచనాలు అయితే క్రియేట్ అవుతున్నాయి. ప్రభాస్ తన స్టార్ ఇమేజ్ తోనే బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అయితే అందుకుంటు ఉన్నాడు. అయితే రాబోయే సినిమాలపై మాత్రం అంచనాలు కాస్త గట్టిగానే ఉన్నాయి.

సలార్ సినిమాతో పాటు కల్కి కూడా తప్పకుండా సక్సెస్ అవుతాయని ఫాన్స్ లో కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే పెరిగాయి. అయితే ప్రభాస్ లిస్టులో ఉన్న కమిట్మెంట్స్ చూస్తూ ఉంటే ఇప్పట్లో మరొక దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా కనిపించడం లేదు. కానీ తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లుగా కొత్త కథనాలు అయితే వైరల్ అవుతున్నాయి.

ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. అలాగే సందీప్ రెడ్డి వంగా తో స్పిరిట్ అనే సినిమా కూడా పూర్తి చేయాల్సి ఉంది. వీటితోపాటు హను రాగవపూడి తో కూడా ఒక లవ్ స్టోరీ గురించి చర్చలు జరుపుతున్నాడు. ఆ ప్రాజెక్టుపై త్వరలోనే ఒక అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ఇప్పుడు అట్లీ తో సినిమా అంటే ప్రభాస్ కోసం చాలా కాలం పాటు ఎదురుచూడాల్సిన అవసరమైతే ఉంది.

ఇక జవాన్ సినిమాతో సక్సెస్ అందుకోవాలని చూస్తున్న అట్లీ ఆ తర్వాత విజయ్ తోనే సినిమా చేస్తాడని కూడా ఆ మధ్య టాక్ వినిపించింది. ఇక ప్రభాస్ కు కూడా అతను ఒక కథ చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కథ ఓకే అయితే గానే సినిమా ఉంటుందా లేదా అనే విషయం పై క్లారిటీ రాదు. ఇంకా ప్రభాస్ అయితే అట్లీ కాబట్టి కథ వినడానికి సిద్ధంగానే ఉన్నాడట. ఇక స్టోరీ ఓకే అయితే మాత్రం ఇప్పుడున్న కమిట్మెంట్స్ తర్వాతనే షూటింగ్ మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.