ఇన్సైడ్ టాక్ : ప్రభాస్ – మారుతీ సినిమా రిలీజ్ కి డేట్.!

Prabhastnail_2020-9-25-17-55-16_thumbnail

టాలీవుడ్ సీనియర్ హీరోలు ఇప్పుడు మళ్ళీ చాలా తర్వాత ఒకేసారి పలు సినిమాలు చేస్తున్న ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. మరి ఈ హీరోల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఉండగా ఇప్పుడు తాను సలార్ , ప్రాజెక్ట్ కే మరియు దర్శకుడు మారుతీ తో ఓ సినిమాని ఒకేసారి చేస్తున్నాడు.

అయితే ఈ సినిమాల్లో రీసెంట్ గానే మారుతీ ప్రాజెక్ట్ స్టార్ట్ కాగా ఈ సినిమాపై ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో మంచి రూమర్స్ వినిపిస్తున్నాయి. వీటితో అయితే ఈ భారీ సినిమా రిలీజ్ ని ఎప్పుడు చేస్తారు అనేది చిత్ర బృందం ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది.

మరి లేటెస్ట్ సమాచారం తో అయితే సినిమా ఈ ఏడాదిలోనే కంప్లీట్ అయిపోతున్నప్పటికీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టుగా వినికిడి. మరి దీనికి గాను డేట్ అయితే రెండో వారం సంక్రాంతి లోనే ఉంటుందట. అంటే 10 నుంచి 14 లోపు రిలీజ్ ఉండొచ్చని లేటెస్ట్ అప్డేట్.

దీనితో ప్రభాస్ అండ్ మారుతీ అయితేసినిమా అయితే అప్పటికి ఫిక్స్ అయ్యిందని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్స్ గా మాళవిక మోహనన్ అలాగే శ్రీ లీల హీరోయిన్స్ గా నటిస్తుండగా ఈ చిత్రంని మారుతీ ఓ హారర్ అండ్ కామెడీ చిత్రంగా తెరకెక్కిస్తుండగా ప్రభాస్ పాత్ర ఈ సినిమాలో చాలా కొత్తగా ఉండనుంది. ఆల్రెడీ తన లుక్ పై కొన్ని ఫోటోలు కూడా బయటకి వచ్చి బాగా వైరల్ అయ్యాయి.