ప్రభాస్.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్లు బిజీగా ఉన్నాడు. ఎంతలా అంటే మరో రెండుమూడు ఏళ్ల వరకు తీరిక లేకుండా. ఆయన చేతిలో ఉన్నవి కూడా మామూలు గీమూలు ప్రాజెక్టులు కావు. అన్నీ భారీ ప్రాజెక్టులే. అన్నీ బాహుబలిని మించిన ప్రాజెక్టులే.
ఇన్ని భారీ ఆఫర్లతో ఫుల్లు బిజీగా ప్రస్తుతం ఏ స్టార్ హీరో కూడా లేడు. కేవలం ప్రభాస్ మాత్రమే తన రేంజ్ ను రోజురోజుకు పెంచుకుంటూ పోతున్నాడు. బాలీవుడ్ లోనూ డైరెక్ట్ గా సినిమాలు చేస్తున్నాడు.
ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. అది కూడా పాన్ ఇండియా మూవీనే. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్నది. ఆ తర్వాత ఆదిపురుష్. దాని తర్వాత కూడా బాలీవుడ్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ కోసం కూడా ప్రభాస్ రెడీ అవుతున్నాడట.
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా 2021 లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉండగా.. ఆ సినిమా షూటింగ్ పూర్తవ్వగానే… ఓవైపు నాగ్ అశ్విన్, మరోవైపు ఆదిపురుష్ సినిమా.. రెండింటి షూటింగ్ లను ఒకేసారి ప్రభాస్ మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది.
తాజా అంచనాల ప్రకారం.. రెండు సినిమాలు 2021లోనే సెట్స్ మీదికి వెళ్లనున్నాయి. అంటే ఆ రెండు సినిమాలు 2022లోనే విడుదల కానున్నాయి.
రెండూ భారీ బడ్జెట్ సినిమాలే. నాగ్ అశ్విన్ సినిమా మాత్రం ఇంటర్నేషనల్ స్థాయి సినిమా. ఈ రెండు భారీ స్థాయి సినిమాలు ఒకేసారి 2022లో రిలీజ్ అయితే ఇంకేమన్నా ఉందా? 2022 సంవత్సరం ప్రభాస్ నామ సంవత్సరమే అవుతుంది. ఆ సంవత్సరం మొత్తం ప్రభాస్ జపమే. ప్రభాస్ గురించే ఆ సంవత్సరం చర్చ ఉంటుంది. మొత్తానికి ప్రభాస్ 2022 సంవత్సరాన్ని గుత్తా పట్టేసుకున్నట్టుగా కనిపిస్తోంది.
అంటే 2022 తర్వాత ప్రభాస్ రేంజ్ మామూలుగా ఉండదు అన్నమాట. ఇక ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ అయిపోతాడు.. అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ మస్తు ఖుషీ అవుతున్నారు.