త్రిప్తి కాదు ఈ బాలీవుడ్ యంగ్ హీరోయిన్ తో రవితేజ..!

టాలీవుడ్ సీనియర్ అండ్ మోస్ట్ ఎనర్జెటిక్ హీరోస్ లో మాస్ మహారాజా రవితేజ కూడా ఒకరు. మరి రవితేజ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం టైగర్ నాగేశ్వరరావు తో తన కెరీర్ లో మూడో హైయెస్ట్ గ్రాసర్ ని తాను అందుకోగా ఈ సినిమా తర్వాత వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా అయితే మరో చిత్రం ఈగిల్ తో తాను రాబోతున్నారు.

ఇక దీనితో పాటుగా రీసెంట్ గానే తన హిట్ దర్శకుడు హరీష్ శంకర్ తో మరో సినిమాని అనౌన్స్ చేయడంతో దీనిపై మంచి హైప్ స్టార్ట్ అయ్యింది. అయితే ఇది ఓ హిందీ సినిమాకి రీమేక్ అంటూ కొన్ని కథనాలు వైరల్ గా మారగా ఇప్పుడు ఓ చిత్రం నుంచి అయితే అప్పుడే హీరోయిన్ పై కూడా మేకర్స్ అప్డేట్ ఇచ్చేసారు.

అయితే గత కొన్నాళ్ల నుంచి రవితేజ నెక్స్ట్ సినిమాలో రీసెంట్ సెన్సేషన్ “ఆనిమల్” బ్యూటీ త్రిప్తి దిమిరి నటిస్తుంది అని కొన్ని రూమర్స్ వచ్చాయి. కానీ తర్వాత అవి నిజం కాదు అని తేలిపోయింది. మరి ఇప్పుడు ఈమె కాకుండా మరో బాలీవుడ్ యంగ్ హీరోయిన్ ని అయితే రవితేజ సరసన మేకర్స్ లాక్ చేసారు.

ఈ ఏడాది బాలీవుడ్ లో హిట్ ఫ్రాంచైజ్ “యారియాన్ 3” లో కనిపించిన యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్స్ ని టాలీవుడ్ కి పరిచయం చేస్తూ మేకర్స్ ఇప్పుడు అప్డేట్ అందించారు. ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రివీల్ చేయడం విశేషం. మరి ఈ సినిమాతో ఆమె టాలీవుడ్ లో ఎలాంటి వెల్కమ్ అందుకుంటుందో వేచి చూడాలి.