టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్నటువంటి కొన్ని క్రేజీ అండ్ సెన్సేషనల్ కాంబినేషన్ లలో అయితే దర్శకుడు హరీష్ శంకర్ అలాగే గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ కూడా ఒకటి. మరి వీరి కాంబినేషన్ లో అయితే బాచిన గబ్బర్ సింగ్ క్రియేట్ చేసిన హవా ఆడియెన్స్ మర్చిపోలేరు.
పవన్ నుంచి ఒక్క హిట్ కోరుకుంటున్న వారికి గబ్బర్ సింగ్ అందించిన హరీష్ శంకర్ తో పవన్ రెండోసారి వర్క్ చేస్తున్న ఆ సినిమానే “ఉస్తాద్ భగత్ సింగ్”. మరి దీనిపై కూడా భారీ అంచనాలు నెలకొనగా ఈ సినిమా కోసం కూడా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే పవన్ ఇపుడు ఉన్న బిజీ మూలాన ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి.
దీనితో హరీష్ శంకర్ ఖాళి అయిపోయాడు. మరి గ్యాప్ పై అయితే తాను చేసిన కామెంట్స్ వింటే తాను ఎంత నమ్మకంగా ఈ సినిమా పట్ల ఉన్నాడో అనేది తెలుస్తుంది. “ఈ గ్యాప్ జస్ట్ వెకేషన్ సినిమా రిలీజ్ అయ్యాక సెన్సేషన్” అంటూ తన మార్క్ ప్రాసలో చాలామంది ప్రశ్నలకి సమాధానం అందించాడు.
ఇక ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఎన్నికల తర్వాత షూటింగ్ స్టార్ట్ చేసుకోనుంది. రిలీజ్ కూడా వీలయితే వచ్చే ఏడాదిలోనే ఉండొచ్చు.